తెలుగు సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు కూతురుగా మంచు లక్ష్మి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎన్నో చిత్రాలలో వైవిద్యమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న మంచు లక్ష్మి ఇటీవల తన సినిమా దక్ష ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ మూర్తి ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో ఆమెను ఒక ప్రశ్న వేయడంతో ఆ ప్రశ్నకు మంచు లక్ష్మి చాలా ఇబ్బంది పడినట్టుగా కనిపించింది. ముఖ్యంగా ఆమె వేసుకొనే బట్టల గురించి ప్రశ్న వేయడంతో ఈ ప్రశ్నను మీరు సూపర్ స్టార్ మహేష్ బాబును అడగగలరా అంటూ సమాధానాన్ని తెలిపింది.



దీంతో ఆ విషయం కాస్త అప్పుడు కాంట్రవర్సీ గా మారడంతో సోషల్ మీడియాలో ఈ విషయం  గురించి చాలామంది ట్రోల్ చేశారు. అయితే ఈ విషయాన్ని మంచు లక్ష్మి చాలా సీరియస్ గా తీసుకొని మరి స్పందించింది. ఆ వెంటనే జర్నలిస్టు మూర్తి పైన ఫిర్యాదు చేయక చాలామంది సెలబ్రిటీలు కూడా మంచు లక్ష్మికి సపోర్ట్ చేశారు. మా అసోసియేషన్ కూడా ఈ విషయం పైన సీరియస్ గానే నిర్ణయం తీసుకుంది.అయితే తాజాగా ఈ విషయం పైన జర్నలిస్టు మూర్తి మంచు లక్ష్మికి క్షమాపణలు చెబుతూ ఒక వీడియోని విడుదల చేశారు.

ఈ వీడియోలో ఈ ప్రశ్న వేయడం వెనుక ఉన్న వాటి గురించి తాను మాట్లాడదలచుకోలేదు, మంచు లక్ష్మి  మనసు చాలా బాధపడింది కాబట్టి తాను మొహమాటం లేకుండా క్షమాపణలు చెబుతున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఈ వివాదం ఇక్కడితో ఆగిపోవాలని కోరుకుంటున్నాను అంటూ తెలియజేశారు జర్నలిస్టు మూర్తి. ఈ వీడియో వైరల్ గా మారడంతో మంచు అభిమానులు కూడా ఈ విషయాన్ని వైరల్ గా చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వీడియోని మంచు లక్ష్మి తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఒక నోట్ రాసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: