టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి నిరంతరం కష్టపడుతున్న యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, తనదైన స్టైల్‌తో, రైమింగ్ డైలాగ్‌లు – టైమింగ్ పంచ్‌లతో, ప్రేక్షకుల మదిలో సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అతని తాజా సినిమా “కే ర్యాంప్” . లాస్ట్ ఇయర్ దీపావళి సీజన్‌కి "కా" తో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో  ఈ ఏడాది పండగ సీజన్‌లో "కె ర్యాంప్ తో" ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సూపర్ డూపర్ హిట్ కొట్టాలని భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఓవర్సీస్ థియేటర్లలో ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన ఎన్నారై ప్రేక్షకులు తమ స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.

ఈ సినిమాతో జైన్స్ నాని దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవడం విశేషం. మొదటి సినిమాకే ఆయన ఒక సీరియస్ సబ్జెక్ట్ అయిన పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (ఫ్ట్శ్డ్) బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సీరియస్ టాపిక్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ టచ్ ఇవ్వడానికి దర్శకుడు చాలా ప్రయత్నించాడని ఎన్నారైలు చెబుతున్నారు. కథలో ప్రధాన పాయింట్ కాస్త సీరియస్‌గా ఉన్నప్పటికీ, మధ్య మధ్యలో ఉన్న కామెడీ సీన్లు సింపుల్‌గా, నేచురల్‌గా ఫినిష్ అయ్యాయని సమీక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొన్ని సన్నివేశాలు ప్రెడిక్టబుల్గా అనిపించాయని, “ఈ సీన్ తర్వాత ఏమి వస్తుందో ముందే తెలుసు” అనే ఫీల్ కలిగిందని కొంతమంది ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.

సినిమా మ్యూజిక్ మాత్రం పూర్తిగా నెగిటివ్ రివ్యూలను అందుకుంటోంది. “మ్యూజిక్ అస్సలు బాగోలేదు, సీన్‌లో ఫీలింగ్ లేకపోయింది” అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలైంది. టీజర్ విడుదల సమయంలోనే డబుల్ మీనింగ్ డైలాగ్స్‌పై భారీ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ విషయంలో కిరణ్ అబ్బవరాన్ని మీడియా ప్రతినిధులు నేరుగా ప్రశ్నించారు. సినిమాలో కూడా అలాంటి డైలాగ్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయని ఎన్నారైలు అభిప్రాయపడుతున్నారు. “వాటిని కాస్త తగ్గించి ఉంటే బాగుండేది” అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మొత్తం సినిమా కె ర్యాంప్ సినిమాకి  కర్త, కర్మ, క్రియ అన్నీ కిరణ్ అబ్బవరమే అని చెప్పొచ్చు. తన నటనతో మరోసారి తన రేంజ్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ, కామెడీ సీన్స్‌లోనూ బాగా ఇంప్రెస్ చేశాడు. అయితే కథ కొంత సీరియల్ లాగా సాగిందని, సినిమా టెంపో కొంచెం తగ్గిందని కొంతమంది ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. దాంతో పబ్లిక్ టాక్ ప్రస్తుతం మిక్స్‌డ్‌గా ఉంది. “ఓకే ఓకే మూవీ”, “వన్ టైమ్ వాచ్‌ఏబుల్” అంటూ రివ్యూలు వస్తున్నాయి. అయినప్పటికీ, కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ మాత్రం ఆయన నటనను తెగ పొగడ్తలు కురిపిస్తున్నారు. “కిరణ్ మళ్లీ తన క్లాస్ నటనతో మెప్పించాడు” అని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, కిరణ్ అబ్బవరం కోసం ఈ మూవీ ఒక ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇకనైనా స్టోరీ సెలెక్షన్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి, కంటెంట్ బలంగా ఉంటే ఆయనకు హిట్ దొరకడం ఖాయం అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో “కే ర్యాంప్ ” మూవీ పబ్లిక్ టాక్ వైరల్‌గా మారింది. మొదటి రోజు కలెక్షన్స్ ఏవిధంగా ఉంటాయో చూడాలి. హిట్, ఫ్లాప్ ఏదైనా – కిరణ్ అబ్బవరం తన డెడికేషన్‌తో మళ్లీ ఒకసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: