ప్రస్తుతం అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియా యుగమే నడుస్తోంది. ఎలాంటి విషయాలనైనా సరే క్షణాలలో వైరల్ గా చేస్తున్నారు. అలా మంచికి మంచి చెడుకు చెడుగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో సోషల్ మీడియా అకౌంట్లో ద్వారా దేశాలు దాటి కూడా పరిచయాలు ఏర్పడుతున్నాయి.కానీ ఈ మధ్య ఎక్కువగా AI ఉపయోగించుకొని చాలామంది తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని ఫేక్ వీడియోలను సృష్టించి, ఫేక్ ఐడీల ద్వారా వైరల్ గా చేస్తున్నారు. చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులే కాకుండా సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో దేశాల మధ్య కూడా చిచ్చుపెట్టే విధంగా కొంతమంది కొన్ని పోస్టులు షేర్ చేస్తుంటారు.అయితే ఇక మీదట ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఎక్స్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ తెలిపారు ఎలాన్ మాస్క్.



ఫేక్ అకౌంట్స్ ట్విట్టర్లో(ఎక్స్ ) సృష్టించి, భారత దేశం మీద వ్యతిరేకంగా పాకిస్తాన్ నుంచి, అమెరికా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇలా అనేక ఫేక్ అకౌంట్స్ విషయాలను నడిపేటువంటి ట్విట్టర్ అకౌంట్లు చాలానే ఉన్నాయి. ఈ ఫేక్ అకౌంట్స్ వల్ల ఏదైనా యుద్ధాలైనా సృష్టించవచ్చు, గొడవలైన జరగవచ్చు. ఇలాంటివి నడిపే సంస్థలు కూడా పెద్ద ఎత్తున చాలా ప్రాంతాలలో ఉన్నాయి. ఇలాంటి దశలోనే ఇప్పుడు ఎక్స్ కీలకమైన అడుగులు వేస్తోంది. ఏ ఎక్స్ అకౌంట్.. ఏ ఏ దేశాల నుంచి ఆపరేట్ అవుతున్నాయనే విషయాన్ని ట్విట్టర్లో ప్రాజెక్ట్ అయ్యేవిధంగా ఒక ఐడియాను తీసుకువచ్చారు ఎలాన్ మాస్క్.


పాకిస్తాన్లో నుంచి ఇండియాలో నడిపిన లేదా ఇండియా నుంచి అమెరికా , పాకిస్తాన్ ఇలా ఎక్కడి నుంచి ఖాతాను ఆపరేట్ చేసిన గుర్తించే విధంగా అడుగులు వేస్తోంది ఎక్స్. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే మాత్రం ఇక మీదట ఫేక్ అకౌంట్లో బాధ అనేటువంటిది తగ్గిపోతుంది. ముఖ్యంగా దేశాల మధ్య కుట్రలు వంటివి చెక్ పెట్టే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా దేశాలకు సంబంధించిన సీక్రెట్స్ ఎవరు బయట పెడుతున్నారనే విషయాలు కూడా బయటపడిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: