ఈ టీజర్‌లో బాలయ్య లుక్, పెర్ఫార్మెన్స్, మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అన్నీ వేరే లెవెల్‌లో ఉన్నాయి. ముఖ్యంగా విలన్లకు వార్నింగ్ ఇస్తూ చెప్పే ఆయన డైలాగ్ — “సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో కొడకా.. దేనికి నవ్వుతానో, దేనికి నరుకుతానో నాకు కూడా తెలియదు!” — ఈ లైన్ మొత్తం సోషల్ మీడియా ని కుదిపేస్తుందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ‘అఖండ 1’లో బాలయ్య మాస్ యాంగిల్‌కి ఓ లిమిట్ ఉండేది, ఆయన ఆగ్రహాన్ని కూడా కంట్రోల్‌లో చూపించారు. కానీ ‘అఖండ 2’లో మాత్రం స్టైలిష్ లుక్‌తో పాటు ఊర నాటు మాస్ డైలాగులు, పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. చిన్న టీజర్‌తోనే బాలయ్య, బోయపాటి శ్రీను డ్యుయో మరోసారి ఏ స్థాయి ఫైర్ చూపించబోతున్నారో స్పష్టంగా తెలుస్తోంది.
బోయపాటి శ్రీను డైరెక్షన్, బాలయ్య పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మొత్తానికి, ‘అఖండ 2’ థియేటర్లలో రిలీజ్ అయితే అది నిజంగానే బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని అభిమానులు అంటున్నారు. ఇంత పవర్ ఉన్న టీజర్ చూసి నెటిజన్లు సరదాగా, “థియేటర్లకు ఇన్సూరెన్స్ తీసుకోవడమే మేలు!” అంటూ ఫ్యూచర్ గుర్తు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘అఖండ 2 టీజర్’ నిజంగా “హార్ట్ అటాక్ లెవెల్” హంగామా సృష్టిస్తోంది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి