కొద్ది రోజుల నుంచి రష్మిక ఎక్కడ చూసినా కూడా మాస్క్ పెట్టుకుని మరి కనిపించింది. తరచూ ముఖానికి మాస్క్ వేసుకొని కనిపించడంతో అసలు అభిమానులు రష్మికకు ఏమైందనే విషయంపై చర్చించారు. ఈ సందర్భంలోనే గతవారం చెన్నై విమానాశ్రయంలో మాస్క్ ధరించి కనిపించిన రష్మిక ఆ సమయంలో మాస్క్ తొలగించాలని ఫోటోగ్రాఫర్లు కోరగా, రష్మిక ట్రీట్మెంట్ తీసుకున్నందువల్ల కుదరదని తెలియజేసిందట. దీంతో రష్మిక కు ఏమైందని విషయంపై అభిమానులు ఆరాతీయగా తన అందాన్ని మరింత మెరుగుపరచడం కోసం ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు తెలిసింది.
అలా చాలా రోజుల తర్వాత ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఈవెంట్లో మాస్క్ లేకుండా కనిపించిన రష్మిక అభిమానులకు ఫుల్ జోష్ నింపేలా చేసింది. గతంలో కంటే ఇప్పుడు మరింత గ్లామర్ గా కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ గా మారాయి. ఇటీవల బాలీవుడ్లో నటించిన థామా సినిమాతో మరొకసారి అదరగొట్టేసింది. ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో రష్మిక జోడిగా దీక్షిత్ శెట్టి నటించారు. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాహుల్ రవీంద్ర తెరకెక్కించగా అనుఇమ్మాన్యుయేల్ కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 7వ తేదీన రిలీజ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి