హీరోయిన్ శాలిని అంటే తెలియని వారు ఉండరు. ఈ హీరోయిన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలు చేసింది. ఈమె సోదరి షామిలి కూడా ఇండస్ట్రీలో సుపరిచితురాలే.అయితే అలాంటి షాలిని తమిళ స్టార్ హీరో అజిత్ ని పెళ్లి చేసుకున్నాక సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. కానీ తమిళ డైరెక్టర్ అలిప్పి అష్రఫ్ శాలిని గురించి సంచలన విషయాలు బయట పెట్టారు.శాలిని తండ్రి శాలినీ సినిమాల్లోకి రాకముందు హోటల్లో గిన్నెలు కడిగేవాడని,ప్రస్తుతం 100 కోట్ల ఆస్తి సంపాదించాడని.. శాలినీ ని ఓ సినిమా కోసం షూటింగ్ సెట్ కి లేటుగా తీసుకువచ్చినందుకు ఓ డైరెక్టర్ చేత తన్నులు తిన్నాడని ఇలా ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయట పెట్టారు. అయితే ఈ విషయాలపై ఎప్పుడు మీడియాకి దూరంగా ఉండే శాలిని తండ్రి బాబు ఓ ఆన్లైన్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిజాలు బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ..తమిళ డైరెక్టర్ అలిప్పీ అష్రఫ్ తో నాకు ఎలాంటి గొడవలు లేవు. కానీ ఆయన ఎందుకు ఇలా నాపై నెగటివ్ గా మాట్లాడారో తెలియడం లేదు.

అలాగే నా కూతురు సినిమాల్లోకి రాకముందు నేను హోటల్ లో గిన్నెలు కడిగాను అనేది అబద్ధం.ఆ దేవుడి దయ వల్ల నాకు ఆ పరిస్థితి రాలేదు.నా కూతురు సినిమాల్లోకి రాకముందు నేను ఓ ఫ్యాన్సీ షాపు రన్ చేసేవాడిని.. అలాగే 100 కోట్ల ఆస్తి ఉంది అని చెబుతున్నాడు. ఆయనకి ఇంత కరెక్టుగా ఎలా తెలుసో అదంతా.. ఆ దేవుడిచ్చిందే.. అలాగే మా ఆవిడ జూనియర్ ఆర్టిస్ట్ కాదు.అసలు ఆమె బయటికి రాదు. నా కూతుర్లు సినిమాల్లో రాణించినప్పుడు కూడా వారిని పట్టుకుని నేనే తిరిగాను.. ఇక శాలినీని షూటింగ్ సెట్ కి లేటుగా తీసుకువచ్చినందుకు దర్శక నటుడు అయినటువంటి బొబన్ నన్ను కొట్టినట్టు ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి నిజం లేదు.నేను షూటింగ్ సెట్ కి లేటుగా తీసుకువెళ్లింది నిజమే. కానీ అంతకుముందే శాలిని మరో సినిమాలో నటించాల్సి ఉండగా ఆ సినిమా షూట్ ముగించుకొని వచ్చేసరికి లేట్ అయింది.

దానికి మమ్మల్ని కాస్త మందలించాడు. ఆ తర్వాత అసలు నిజం చెప్పాక సైలెంట్ అయ్యాడు. కానీ బొబన్ నన్ను కొట్టారని, దాంతో నేను చెరువులో దూకితే నన్ను ఎవరో కాపాడారని, దెబ్బలు తగిలాయని ఏవేవో మాట్లాడారు. అందులో ఎలాంటి నిజం లేదు.నాకు చెరువులో దూకాల్సిన పరిస్థితి రాలేదు. ఒకవేళ దూకినా నాకు ఈత వస్తుంది. సముద్రంలో కూడా ఈదగలను.. అదంతా అవాస్తవం. ఇక నా అల్లుడు అజిత్ 180 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటే అది నిజమే.ఎందుకంటే ఆయన రేంజ్ కి తగ్గట్టు ఆయన తీసుకుంటున్నారు.ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ కి తగ్గట్టుగానే ట్యాక్స్ కూడా కడుతున్నారు. అందులో తప్పేమీ లేదు అంటూ దర్శకుడికి ఇచ్చి పడేశారు శాలిని తండ్రి బాబు.. ఇక ఎలైస్-బాబులకి సంతానంగా శాలిని, షామిలి, కొడుకు రీచార్డ్ లు ఉన్నారు. అలా శాలిని ఫాదర్ పై డైరెక్టర్ చేసిన అబద్ధాలపై శాలిని ఫాదర్ క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: