నందమూరి నటసింహం బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్‌లో ఒక బ్రాండ్ లాంటిది. ఈ కాంబో నుంచి వచ్చిన “ సింహా ”, “ లెజెండ్ ”, “ అఖండ ” సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోష్‌తో ఈ జంట మరోసారి కలసి తెరకెక్కిస్తున్న సినిమా “ అఖండ 2 : తాండవం ”. ఇప్పటికే ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్ అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. బాలయ్య మాస్ లుక్, బోయపాటి మార్క్ డైలాగ్స్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిపి అఖండ ఫ్రాంచైజ్‌కి తగిన స్థాయి హైప్‌ను పెంచేశాయి. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఫస్ట్ సింగిల్ కోసం వెయిట్ చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ మొదటి పాటగా పవర్‌ఫుల్ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ పాటలో బాలయ్య ఎనర్జీ, బోయపాటి మాస్ టచ్, థమన్ మ్యూజిక్ కలయికగా ఒక సెన్సేషన్ సాంగ్ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. నవంబర్ మొదటి వారంలో ఈ టైటిల్ ట్రాక్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
14 రీల్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న “అఖండ 2: తాండవం”లో యాక్షన్, దేవోషనల్, ఎమోషనల్ అంశాలు ఈక్వల్‌గా ఉండనున్నాయి. బాలయ్య రెండు వేరువేరు షేడ్స్‌లో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సంక్రాంతికి ముందే బాలయ్య తాండవం టాలీవుడ్‌ను కుదిపేయడం ఖాయమని అభిమానులు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నరు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి