ఓటీటీ మార్కెట్ గత కొంతకాలంగా ఊహించని స్థాయిలో మందగించింది. చిన్న సినిమాలు అయితే దాదాపుగా ఓటీటీ ఆశలు వదిలేసుకున్నాయి. మీడియం రేంజ్ సినిమాలు మాత్రం అటు థియేటర్‌కి, ఇటు ఓటీటీకి సరైన స్థానం దొరకక ఇబ్బంది పడుతున్నాయి. మంచి కంటెంట్ ఉంటే లేదా పెద్ద బ్యానర్ నుంచి వస్తే తప్ప, ఇప్పుడు ప్లాట్‌ఫాంలు ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో స్టార్ సినిమాలు మాత్రమే సేఫ్ జోన్‌లో ఉన్నాయి. స్టార్‌ హీరోలు పెద్దవాళ్లు కావడంతో, వారి సినిమాల కోసం ఓటీటీలు ముందుగా క్యూలో నిలుస్తాయి. అయితే ఇప్పుడు ఆ రూల్‌కీ ఎక్స్‌సెప్షన్ వచ్చింది ప్రభాస్ నటిస్తున్న “రాజాసాబ్”.


మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయినా కూడా ఓటీటీ హక్కులు ఇంకా అమ్ముడు కాక‌పోవ‌డం నిజంగా షాకే. దీనికి వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది. వాస్తవానికి “రాజాసాబ్” ఓటీటీ డీల్ దాదాపు ఫైనల్ దశలోనే ఉందట. హాట్‌స్టార్ ఈ సినిమాకు నాన్ - థియేట్రికల్ రైట్స్ కొనే ప్రయత్నం చేస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ.200 కోట్లుగా వినిపిస్తోంది. కానీ అడ్డంకి ఫైనాన్స్ సమస్య. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా కోసం ముంబైలోని ఒక ఫైనాన్స్ సంస్థ దగ్గర దాదాపు రూ.250 కోట్లు అప్పు తీసుకున్నట్లు సమాచారం. వడ్డీలతో కలిపి ఆ మొత్తం రూ.300 కోట్లకు చేరిందట.


ప్రస్తుతం ఆ సంస్థతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కోర్టు వివాదం నడుస్తోంది. అందుకే ఆ సంస్థ నుంచి ఎన్.ఓ.సీ లేకుండా ఓటీటీ డీల్ క్లోజ్ చేయడం సాధ్యం కాదు. ఇప్పటికే రెండు సంస్థల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. నవంబర్ చివరి వారానికి ఫైనాన్స్ క్లియర్ చేసి, డీల్ పూర్తి చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. నవంబర్ 5న తొలి పాట విడుదల కానుంది, ఆ తర్వాత ప్రమోషన్లు మొదలవుతాయి. జనవరి 9న “రాజాసాబ్” థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: