సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది నటులు ఒక హీరో ఆ సినిమాలో నటిస్తున్నాడు అని లేదా ఫలానా దర్శకుడు ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు అని వారిపై ఉన్న అభిమానంతో సినిమా కథ కూడా వినకుండా సినిమాలు చేసిని సందర్భాలు అనేకం ఉన్నాయి. నాని హీరో గా నటించిన ఓ సినిమాలో ఆయన హీరో గా నటించాడు అనే ఒకే ఒక కారణంతో ఒక నటుడు ఆ సినిమా కథ కూడా వినకుండా విలన్ పాత్రలో నటించాను అని ఓ ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

ఇంతకు ఆ నటుడు ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు ... ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమంలో మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న నటులలో ఒకరు అయినటువంటి తిరువీరు. ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన మాట్లాడుతూ ... నాని హీరో గా రూపొందిన టక్ జగదీష్ సినిమాలో విలన్ పాత్రలో అవకాశం వచ్చింది. ఆ సినిమాకు శివ నిర్వాన దర్శకత్వం వహించాడు. ఆయన అంతకు ముందు దర్శకత్వం వహించిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక ఓ వైపు నాని హీరో గా నటిస్తున్న మూవీ కావడం , మరో వైపు శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో ఆ మూవీ లో విలన్ పాత్రలో అవకాశం రావడంతో సినిమా కథ కూడా వినకుండా ఆ మూవీ లో విలన్ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాను అని ఆయన తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే తిరువిర్ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి నటుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాలలో హీరో పాత్రల్లో కూడా నటించాడు. ఇలా ప్రస్తుతం ఈయన తన కెరీర్ను అద్భుతమైన రీతిలో ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: