డైరెక్టర్ కూడా కొంతకాలం వేచి చూశారట. కానీ నాగ చైతన్య షెడ్యూల్ క్లియర్ కాకపోవడంతో చివరికి ప్రదీప్ తో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారట. అంతే — అదృష్టం ఆ ప్రదీప్ రంగన్నధన్ వైపే తిరిగింది. సినిమా పూర్తయి విడుదలైన వెంటనే ప్రేక్షకులు ఆ సినిమాను తెగ ఆదరించారు. “డ్యూడ్” బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి, కేవలం కొన్ని వారాల్లోనే 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఒకే మాట చెబుతోంది —“ఈ సినిమా నాగ చైతన్య చేసి ఉంటే, ఆయన కెరీర్ మరో స్థాయిలో ఉండేది!” ఎందుకంటే, ఆ సినిమాతో ప్రదీప్ ఒక్కసారిగా స్టార్ రేంజ్‌లోకి వెళ్లిపోయాడు. ఒకేసారి అతని మార్కెట్, ఇమేజ్, ఫాలోయింగ్ మూడు లెవెల్స్ పెరిగిపోయాయి. అదే సినిమా చైతు చేతిలో ఉండి ఉంటే — అది ఆయన కెరీర్ టర్నింగ్ పాయింట్ అయ్యేదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కానీ నాగ చైతన్య మాత్రం ఈ వార్తలపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఎప్పటిలాగే కూల్‌గా తన వర్క్‌పైనే ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన రెండు పెద్ద ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి పవర్‌పుల్ యాక్షన్ థ్రిల్లర్ కాగా, మరొకటి సెన్సిటివ్ ఎమోషనల్ లవ్ డ్రామా జానర్‌లో రూపొందుతోంది.సినిమా వదిలేయడం ఎప్పుడూ తప్పు నిర్ణయం కాదు — కానీ కొన్ని సార్లు టైమింగ్ అన్నది మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. “డ్యూడ్” విషయంలో అదే జరిగిందని చెప్పొచ్చు. చిన్న కారణం వల్ల వదిలేసిన సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్ హిట్‌గా నిలిచింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి