తెలుగు సినీ పరిశ్రమలో సినీ పెద్ద అంటే ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి పేరును ప్రస్తావిస్తారు. అలాంటి చిరంజీవి కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. అలా తన స్వయంకృషితోనే ఇండస్ట్రీలో ఎదిగారు. చిరంజీవి కెరియర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచిన ఒక కల్ట్ క్లాసికల్ చిత్రం ఖైదీ. ఈ సినిమా 1983 అక్టోబర్ 28న విడుదలై తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా విడుదల ఇప్పటికి 42 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఖైదీ సినిమా విషయంపై అప్పటికి ఇప్పటికీ ప్రేక్షకులలో అదే ఉత్సాహం కనిపిస్తోంది.


ఖైదీ సినిమా అంటే కేవలం సినిమా కాదు, టాలీవుడ్ సినీ పరిశ్రమ రూపురేఖలు మార్చేసిన రివల్యూషన్ సినిమాగా నిలిచింది. చిరంజీవిని స్టార్ డం పెంచే స్థాయిలో చేసింది.  ఖైదీ సినిమా  42 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి టీమ్ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు. తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకువచ్చినటువంటి పేరే ఖైదీ అంటూ ఈ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో అభిమానులను చాలా ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది.



వాస్తవంగా మొదట ఖైదీ సినిమా కథను సూపర్ స్టార్ కృష్ణ కోసం ఈ సినిమా కథను ప్లాన్ చేశారట. కానీ కొన్ని కారణాల చేత కృష్ణ చేయలేకపోవడంతో ఆ అవకాశం చిరంజీవికి లభించింది. డైరెక్టర్ విషయంలో కూడా మొదట రాఘవేంద్రరావు పేరు ను పరిగణంలోకి తీసుకున్నప్పటికీ చివరికి ఈ సినిమా బాధ్యతను డైరెక్టర్ కోదండరామిరెడ్డి తీసుకున్నారు. పరుచూరి బ్రదర్స్ రాసిన ఈ సినిమా కథ, డైలాగ్స్ చిరంజీవికి బాగా సరిపోయాయి. ఖైదీ చిత్రం (1982లో హాలీవుడ్ చిత్రం ఫస్ట్ బ్లడ్ ఆధారంగా రూపుదిద్దుకుంది)

సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాతే చిరంజీవిసినిమా సంబంధించి పూర్తి కథను విన్నారు. ఈ చిత్రానికి చిరంజీవి రూ. 1.75 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. డైరెక్టర్ కోదండరామిరెడ్డి రూ .40 వేల రూపాయలు తీసుకున్నారు. దీంతో ఏకంగా ఈ సినిమా రూ.25 లక్షల రూపాయల బడ్జెట్ తో తీయగా రూ .70 లక్షల రూపాయల వరకు బిజినెస్ జరిగింది. బాక్సాఫీస్ వద్ద రూ.4 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం ఆ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. అంతేకాకుండా అప్పట్లోనే 3.5 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి, అలాగే 20 కేంద్రాలలో 100 రోజులు, 5 కేంద్రాలలో 200 రోజులు రెండు కేంద్రాలను 365 రోజులు సినిమా ఆడింది. ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హీరో కృష్ణ గెస్ట్ గా వచ్చారు. ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమిక్స్ చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: