తమిళ స్టార్ నటలలో ఒకరు అయినటువంటి సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు తమిళ్ లో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా అద్భుతమైన గుర్తింపు ఉంది.

గత కొన్ని సంవత్సరాలుగా సూర్య నేరుగా తెలుగు సినిమా చేయబోతున్నాడు అని అనేక వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈయన కొంత కాలం క్రితం తెలుగు దర్శకుడు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో నేరుగా ఓ తెలుగు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈయన మరో తెలుగు దర్శకుడితో తెలుగు సినిమా చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో పరుశురామ్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో దర్శకత్వం వహించిన సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. కానీ గత కొంత కాలంగా ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు పెద్ద స్థాయి సక్సెస్ లను అందుకోలేదు.

ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని సూర్య తో చేయాలి అనుకుంటున్నట్లు , అందులో భాగంగా తాజాగా ఆయనను కలిసి ఓ కథను కూడా వివరించినట్లు , అది బాగా నచ్చడంతో సూర్య కూడా ఈయన దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. దీనితో కొంత మంది పరుశురామ్ ప్రస్తుతం పెద్దగా ఫామ్ లో లేరు. అలాంటి దర్శకుడితో సూర్య సినిమా చేయడం అంటే కాస్త రిస్క్ అని అభిప్రాయ పడుతున్నారు. మరి కొంత మంది మాత్రం సూర్య ఓకే చెప్పాడు అంటే పరుశురామ్ అద్భుతమైన కథను రెడీ చేసుకుంటాడు అని అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: