టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం కొంత కాలం క్రితం క అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో కిరణ్ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఏర్పడింది. అలా క సినిమాతో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమంలో దక్కించుకున్న ఈయన ఆ తర్వాత దిల్ రుబా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. క లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత కిరణ్ కి దిల్ రుబా  మూవీ తో అపజయం దక్కింది. ఇకపోతే తాజాగా కిరణ్ "కే ర్యాంప్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ మూవీ మంచి టాక్ ను తెచ్చుకొని మంచి కలెక్షన్లను వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను కూడా అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది.

ఈ 11 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 3.92 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 1.88 కోట్లు , ఆంధ్ర లో 4.70 కోట్లు , కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.10 కోట్లు , ఓవర్సీస్ లో 1.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో 12.90 కోట్ల షేర్  ... 23.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 8.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 9 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగి ... ఇప్పటివరకు 3.90 కోట్ల లాభాలను అందుకుంది. ఇక మాస్ జాతర సినిమా విడుదల అయ్యే వరకు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లు దక్కే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: