మొంథా తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలంగా మారాయి.. తుఫాన్ వల్ల ఎక్కడికక్కడ చెట్లు చెలిమలు అస్తవ్యస్తమైపోయాయి. ఈ నేపథ్యంలోనే అల్లు శిరీష్ ప్లాన్ ని కూడా మొంథా తుఫాన్ చెడగొట్టిందట. మరి ఇంతకీ అల్లు శిరీష్ వేసుకున్న ప్లాన్ ఏంటి.. తుఫాన్ వల్ల ఆయనకు జరిగిన నష్టం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. అల్లు శిరీష్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో ఏముందంటే..డెకరేషన్ కి సంబంధించి అన్ని అస్తవ్యస్తంగా పడిపోయి ఉన్నాయి.అయితే అల్లు శిరీష్ రీసెంట్ గా నైనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ఒక పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది దీపావళి సెలబ్రేషన్స్ లో కూడా అల్లు శిరీష్ కి కాబోయే భార్య అల్లు కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకుంది.

అయితే అల్లు శిరీష్, నైనిక ల ఎంగేజ్మెంట్ అక్టోబర్ 31న అల్లు అరవింద్ నివాసంలో ప్లాన్ చేసుకున్నారట. అయితే తుఫాను ప్రభావంతో వర్షం ఎక్కువగా పడడం వల్ల డెకరేషన్ వర్క్ ఎక్కడికక్కడే ఆగిపోయింది.ఇక దీనికి సంబంధించిన ఫోటోని అల్లు శిరీష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి చలికాలంలో ఎంగేజ్మెంట్ ని అవుట్ డోర్ లో ప్లాన్ చేసుకున్నాను.కానీ  దేవుడికి వాతావరణానికి వేరే ప్లాన్స్ ఉన్నాయి అంటూ పోస్ట్ పెట్టారు. అయితే అల్లు శిరీష్ తన ఎంగేజ్మెంట్ ని ఎంతో గ్రాండ్ గా తన సొంతింటిలో చేసుకోవాలి అనుకున్నారు.
 కానీ తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ వర్షాలు పడడం కారణంగా డెకరేషన్ వర్క్ అక్కడితో ఆగిపోయింది అని చాలా హర్ట్ అయినట్టు ఈ పోస్టు ద్వారా అర్థమవుతుంది. ప్రస్తుతం అల్లు శిరీష్ పెట్టిన పోస్ట్ మారడంతో చాలామంది నెటిజెన్లు సర్సర్లే ఎన్నెన్నో అనుకుంటాం.. అన్ని జరగాలని లేదు కదా..అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.అలా అల్లు శిరీష్ తన ఎంగేజ్మెంట్ కోసం వేసుకున్న ప్లాన్స్ అన్నింటిని తుఫాన్ చెడగొట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: