బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన పేరును మారు మోగేలా చేశారు డైరెక్టర్ రాజమౌళి. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటించగా మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా కట్టప్ప పాత్రలో సత్యరాజ్ అద్భుతంగా నటించి భారీ క్రేజ్ అందుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి కొత్త సినిమా మహేష్ బాబుతో చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక 2027 లో రాజమౌళి చేయబోతున్న ఒక కొత్త మూవీ థియేటర్లోకి రాబోతోంది. ఇంతకీ ఆ సినిమా పేరు ఏమిటంటే బాహుబలి ది ఎటర్నల్ వార్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఇషాన్ శుక్ల దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నట్లు వినిపిస్తున్నాయి.


ఈ చిత్రాన్ని 2027 థియేటర్లో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమా మొత్తం యానిమేషన్ గా ఉండబోతున్నట్లు రాజమౌళి తెలియజేశారు. దేశ రాక్షసుల యుద్ధంలో బాహుబలి ప్రమేయం ఎలా ఉంటుంది అనే విషయంలో మహా అవతార్ లాంటి యానిమేషన్  చిత్రం రాబోతోందన్నట్లుగా రాజమౌళి తెలియజేశారు. రాజమౌళి ప్రకటనతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. బాహుబలి సినిమా భాష సరిహద్దులు దేశ సరిహద్దులను దాటి కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. మరి బాహుబలి పేరుతో రాబోతున్న బాహుబలి ది ఎటర్నల్ వార్ అనే సినిమా ఏ విధంగా కలెక్షన్స్ రాబడుతుందొ చూడాలి.


బాహుబలి చిత్రం థియేటర్లో విడుదల ఇప్పటికి 10 ఏళ్లు ఆయన సందర్భంగా అక్టోబర్ 31(ఈరోజు) బాహుబలి చిత్రాన్ని రెండు భాగాలుగా కలిపి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ సినిమా ఎలాంటి కనెక్షన్ రాబడుతుందో చూడలి. అలాగే నవంబర్ నెలలో  SSMB 29 సినిమాకు సంబంధించి అప్డేట్ ని విడుదల చేస్తామంటూ రాజమౌళి ప్రకటించారు. ఈ సినిమా కోసం హైదరాబాదులో ప్రత్యేకించి మరి ఈవెంట్ నిర్వహించి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: