టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులు అయినటువంటి నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్ , రీద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటివరకు ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను మాత్రమే విడుదల చేశారు. కానీ వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. దానితో ఈ సినిమాపై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ చేసినట్లు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజా సాబ్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 180 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.

ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా కంటే కూడా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా రాజా సాబ్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ ప్రియ రిలీజ్ బిజినెస్ జరిగింది అని వార్తలు రావడంతో చాలా మంది రాజా సాబ్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లయితే ఆ రేంజ్ షేర్ కలెక్షన్లను రాబట్ట గలదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: