మాస్ మహారాజా రవితేజ తాజాగా మాస్ జాతర అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను ఈ రోజు అనగా అక్టోబర్ 31 వ తేదీన ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో టికెట్ బుకింగ్లు దాదాపు చాలా ప్రాంతాలలో ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ ప్రీమియర్స్ టికెట్ బుకింగ్లకి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ని రేపు అనగా నవంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వరల్డ్ వైడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయింది. ఈ సినిమాకు పెద్ద మొత్తంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఎన్ని కోట్ల టార్గెట్తో ఆఫీస్ బరిలోకి దిగబోతుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు నైజాం ఏరియాలో 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , సీడెడ్ ఏరియాలో 3.5 కోట్లు , ఆంధ్ర లో 11.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 2 కోట్లు , ఓవర్ సిస్ లో 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 31 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt