- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ లో ఈ వారం రెండు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డుతున్నాయి. ఎప్పుడో ప‌దేళ్ల క్రితం వ‌చ్చిన బాహుబ‌లి 1 .. ఆ త‌ర్వాత వ‌చ్చిన బాహుబ‌లి 2 రెండు సినిమాల‌ను కలిపి బాహుబ‌లి - ది ఎపిక్ పేరుతో ఇప్పుడు ఈ రోజు థియేట‌ర్ల లోకి వ‌స్తోంది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మ‌తిపోతోంది. అటు టాలీవుడ్ మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ న‌టించిన మాస్ జాత‌ర కూడా రేపు రిలీజ్ అవుతున్నా .. ఈ రోజు సాయంత్రం ఫస్ట్ షో నుంచే థియేట‌ర్ల లోకి వ‌స్తోంది. మ‌రి ఈ రెండు సినిమాల మ‌ధ్య కంపేరిజ‌న్ చూస్తే ప‌దేళ్ల క్రితం వ‌చ్చిన బాహుబ‌లి - ది ఎపిక్ ముందు ర‌వితేజ కొత్త సినిమా మాస్ జాత‌ర బేజారు అవుతోంది.


పదేళ్ల క్రితం హిట్ అయిన  బాహుబలి కి బుక్ మై షో లో గంటకి 7 వేల టికెట్స్ అమ్ముడుపోతుంటే .. ఇటు ఫ్రెష్ గా రిలీజ్ అవుతున్న మాస్ జాతర కి గంటకి కేవ‌లం 1200 టికెట్లు అమ్ముడుపోతున్నాయి. దీనిని బ‌ట్టి ర‌వితేజ మార్కెట్ ఎంత దారుణంగా పడిపోయిందో తెలుస్తోంది. గాడ్ ఫాదర్ లేకుండా, స్వయంకృషితో ఎదిగిన రవితేజ మీద అభిమానం ఉన్నా, రొటీన్ సినిమాలతో బోర్ కొడుతోంది. అస‌లు ర‌వితేజ గ‌త కొంత కాలంగా క‌థ .. క‌థ‌నాల మీద దృష్టి పెట్ట‌కుండా కేవ‌లం రెమ్యున‌రేష‌న్ చూసుకుని సినిమాలు తీసుకు పోతున్నార ని .. అందుకే వ‌రుస ప్లాపులు త‌ప్ప‌డం లేద‌ని అంటున్నారు. ఇండస్ట్రీ లో ఉండాలంటే హీరో గానే ఉండాల్సిన పనిలేదు.. అమితాబ్ బచ్చన్ లా మంచి పాత్రలు చేస్తూ స్టార్ ఇమేజ్ కాపాడుకోవచ్చు క‌దా అని ర‌వితేజ‌కు ఇప్పుడు ప‌లువురు స‌ల‌హాలు ఇస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: