సినిమాకి ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ప్రాణం. ఆ రెండూ బావుంటే ప్రేక్షకుడు సంతృప్తితో బయటికి వస్తాడు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు టాలీవుడ్ లో 2025 క్యాలెండ‌ర్ క్లైమాక్స్‌కు చేరుకోబోతోంది. న‌వంబ‌ర్ నెల‌లో మంచి నెంబర్స్ స్కోర్ చేసే సినిమాలు ఉన్నాయి. న‌వంబ‌ర్ ఆరంభానికి మంచి ఆరంభం దొర‌క‌లేదు. ర‌వితేజ మాస్ జాత‌ర ప‌ర‌మ రొటీన్ సినిమాగా ప్లాపు ఖాతాలోకి తొలి రోజే వెళ్లిపోయింది. ఇక ఈ సినిమా మీద ఆశ‌లు పోయాయి. అస‌లు ఈ సినిమా రిలీజ్‌కు ముందే బ‌జ్ లేదు. ఇక న‌వంబ‌ర్ 7న నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ర‌ష్మిక మంద‌న్న ది గ‌ర్ల్‌ఫ్రెండ్ సినిమాపై అంచ‌నాలు ఉన్నాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్రాండ్ పై వస్తోంది. ప్యూర్ లవ్ స్టోరీ ఇది. ఇది ఆమెకు సోలో సినిమా.


ఇక మ‌రో హీరో సుధీర్ బాబు జటాధరతో వస్తున్నాడు. సోనాక్షి సిన్హా ఇందులో కీలక పాత్ర. పాన్ ఇండియా అంటూ తెలుగు, ఇటు హిందీలోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. సుధీర్ బాబుకు చాలా రోజులుగా హిట్ లేదు. ఇక విష్ణు విశాల్ ఆర్యన్ తో వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా తమిళ్ లో రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకోగా .. ఇక్క‌డ తెలుగు ప్రేక్ష‌కులు ఈ సినిమాను ఏం చేస్తారో ?  చూడాలి. తిరువీర్ నటించిన గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో పాటు ప్రేమిస్తున్నా అనే మరో సినిమా వస్తోంది. ఈ రెండు సినిమాలపై కూడా అంత బజ్ లేద‌నే చెప్పాలి. ఇక న‌వంబ‌ర్ సెకండ్ వీక్ లో దుల్క‌ర్ స‌ల్మాన్ కాంత సినిమా తో పాటు చాందిని చౌదరి సంతాన ప్రాప్తిరస్తు సినిమాలు వస్తున్నాయి.


లక్కీ భాస్కర్ తర్వాత దుల్కర్ నుంచి వస్తున్న తెలుగు సినిమా, భాగ్యశ్రీ హీరోయిన్ కావడంతో అంచ‌నాలు ఉన్నాయి. ఇక న‌వంబ‌ర్ థ‌ర్డ్ వీక్ లో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ వస్తోంది. ఇదొక థ్రిల్లర్. పోలిమేర సినిమాకి పని చేసిన అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకి షో రన్నర్ కావడంతో అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌మోష‌న్లు లేవు. వేణు ఊడుగుల నిర్మించిన చిత్రం రాజు వెడ్స్‌ రాంబాయి. ఇక ఈ నెల చివ‌ర్లో రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో వ‌స్తున్నాడు. మైత్రీ వాళ్ల సినిమా కావ‌డంతో అంచ‌నాలు ఉన్నాయి. ఫైన‌ల్‌గా నవంబర్ బరిలో అన్నీ వెరైటీ సినిమాలే వున్నాయి. మరి ఇందులో బాక్సాఫీసుని సందడిగా మార్చే సినిమాలెన్నో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: