ఒకప్పుడు సినిమాలలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన రోజా ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. తెలుగు బుల్లితెర పైన కూడా జబర్దస్త్ షోకి జడ్జిగా కూడా వ్యవహరించింది. రాజకీయాల పరంగా కూడా ఎంట్రీ ఇచ్చి నగరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా గత ప్రభుత్వంలో పనిచేశారు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారడంత రోజా మల్లి తిరిగి సిని పరిశ్రమలో బిజీగా మారడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగులో పలు టీవీ షోలలో జడ్జిగా , గెస్ట్ గా కూడా పలు షోలకు హాజరవుతోంది. ఇప్పుడు తాజాగా సినిమాలలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.



తెలుగులో చివరిగా 2013లో నటించగా ,తమిళంలో 2015లో నటించింది రోజా. అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న రోజా ఇప్పుడు తాజాగా తమిళంలో అగ్రనిర్మాత సంస్థగా పేరు సంపాదించిన సత్య జ్యోతి ఫిలిం బ్యానర్ పై డైరెక్టర్ డిడి బాలచంద్రాన్ దర్శకత్వంలో లెనిన్ పాండ్యన్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో రోజా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత రోజా రీ ఎంట్రీ ఇస్తూ ఒక స్పెషల్ వీడియోని కూడా షేర్ చేసింది ప్రముఖ హీరోయిన్ ఖుష్బూ.

ఈ వీడియోలో ఒకప్పటి స్టార్, 90 క్వీన్ రోజా రీఎంట్రీ ఇస్తోందంటూ తెలియజేశారు. ఆమె పాత సినిమాలకు సంబంధించి కొన్ని క్లిప్స్ చూపిస్తూ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్న సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూపించారు. ఇందులో రోజా డి గ్లామర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది అలాగే వయసైపోయి  బాధపడుతున్న ఒక పెద్దవిడ పాత్రలో రోజా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న రోజా కెరియర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి. అలాగే మరి తెలుగు సినిమాలలో కూడా నటించే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: