తెలుగు సినీ ప్రపంచంలో క్రమశిక్షణ, అంకితభావం, నైపుణ్యపూర్వక నటనకు ప్రతీకగా నిలిచిన మోహన్ బాబు, తన 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని అందరితో పంచుకుంటూ ఈ విందును మరింత ప్రత్యేకంగా చేశారు.అతిథులను వ్యక్తిగతంగా పలకరించి, ప్రతి ఒక్కరితో మామూలుగా కాకుండా ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడిన మోహన్ బాబు, తన ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలను, సాధించిన విజయాలను స్మరించుకున్నారు. ఆయన ఆతిథ్యాన్ని అందుకున్న మీడియా-‘మా’ సభ్యులు కూడా ఈ అరుదైన సందర్భంలో పాల్గొనడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అయితే, ఈ విందులో ఒక ఆసక్తికర అంశం చర్చనీయాంశమైంది. సాధారణంగా మోహన్ బాబుకు ‘రైట్ హ్యాండ్’ లా నిలిచే ఇద్దరు ప్రముఖ స్టార్లు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. వారు ఎందుకు రాలేదనే అనుమానాలు, గుసగుసలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.ఇదిలా ఉండగా, నవంబర్ 22, 2025న మోహన్ బాబు సినీ ప్రయాణానికి సంబంధించిన భారీ వేడుకను – “MB50: : ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్” పేరుతో – నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఈ వేడుకను ఆయన వారసుడు, నటుడు విష్ణు మంచు అత్యంత ప్రతిష్టాత్మకంగా, అద్భుతంగా రూపొందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోన్నట్లు సమాచారం. తెలుగు సినీ పరిశ్రమతో పాటు ఇతర రంగాల ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మోహన్ బాబు గౌరవాన్ని మరింత పెంచనున్నారని తెలుస్తోంది. 50 ఏళ్లు పూర్తి చేసిన ఈ మెగాస్టార్ ప్రస్థానం, తెలుగు సినీ వర్గాల్లోనే కాదు, మొత్తం భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచిపోనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి