తెలుగు పోస్టర్‌లో టైటిల్ ‘Andhra King’ అనే ఇంగ్లీష్ అక్షరాలతో ఉండగా, ‘ తాలూకా ’ అనే పదం మాత్రమే తెలుగులో కనిపిస్తోంది. అంటే టైటిల్‌లో తెలుగు భాషను పరిమితంగా వాడారు. అయితే తాజాగా రిలీజ్ చేసిన కన్నడ వెర్షన్‌లో మాత్రం కన్నడలోనే పూర్తిగా టైటిల్ డిజైన్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో తెలుగు ప్రేక్షకులలో అసంతృప్తి మొదలైంది. కన్నడ వెర్షన్‌లో టైటిల్ మొత్తం కన్నడలో ఉంచితే, మన తెలుగు వెర్షన్‌లో కూడా టైటిల్ మొత్తాన్ని తెలుగులో ఇవ్వొచ్చు కదా ? లేదా కనీసం ‘తాలూకా’ ఎలా తెలుగులో పెట్టారో, అలాగే కన్నడ పోస్టర్‌లో కూడా కేవలం ఆ పదాన్ని మాత్రమే వారి లిపిలో ఉంచి, మిగతా పేరును యూనిఫామ్‌గా ఉంచవచ్చు కదా? అన్న ప్రశ్నలు చర్చకు వచ్చాయి.
ఇదివరకూ కన్నడలో డబ్ లేదా డైరెక్ట్‌గా విడుదలైన అనేక తెలుగు సినిమాలు టైటిల్‌ను కన్నడ భాషలోకి మార్చి అక్కడకు వెళ్లారు. అక్కడ భాషకు మనవాళ్లు గౌరవం ఇస్తూ... ఇక్కడి భాషను పట్టించుకోకుండా ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశం అవుతోంది. మన తెలుగు భాష ప్రేమికులం.. తెలుగులోనే కనీసం టైటిల్స్ కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా ఇది ఎమోషన్ గా మారి తెలుగు భాషాభిమానులను ఇబ్బంది పెట్టేలా వెళుతోంది. దీనిపై యూనిట్ ఎలా క్లారిటీ ఇస్తుందో ? చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి