ఇలాగే రవికి మద్దతు తెలుపుతూ తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక ఆటో డ్రైవర్ తన ఆటో వెనుకభాగంలో రవి ఫోటోతో కూడిన పెద్ద సైజ్ పోస్టర్ అతికించాడు. సాధారణంగా ఆటోలు, బస్సులు, లారీలు—ఇవన్నీ హీరోయిన్, హీరోల ఫొటోలు, మత సంబంధిత చిత్రాలు లేదా ఫ్యాన్సీ కోట్స్‌తో కనిపిస్తాయి. కానీ ఈ సారి మాత్రం ప్రజాదరణ పొందిన వ్యక్తిగా ఐబొమ్మ రవి ఫొటో దర్శనమివ్వడంతో ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఆ పోస్టర్‌పై “తెలంగాణ రియల్ హీరో – ఐబొమ్మ రవన్న” అని రాసి ఉంది. ఆటో డ్రైవర్ మాత్రం గర్వంగా—“ఇతడే నిజమైన మనిషి. నిజం కోసం మాట్లాడే వ్యక్తి. అతడికి నా తరఫున మద్దతు”—అని చెప్పిన్నట్లుంది. దీంతో సోషల్ మీడియాలో వేలాది షేర్లతో ఈ వీడియో దూసుకుపోతోంది.
ఈ ఘటనపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఆడు మగాడ్రా బుజ్జి… యావత్ ప్రపంచం వాడి వైపే చూస్తుంది!”..“వీడియో పర్ఫెక్ట్ సినిమా క్లైమాక్స్‌లా ఉంది… అబ్జల్యూట్ సినమాటిక్ మోమెంట్!”..“ఇలాంటి వాళ్లు ముందుకు రావాలి… సిస్టమ్‌ను ప్రశ్నించే ధైర్యం అందరికీ ఉండదు.” అంటూ కొందరు రవిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ మరోవైపు, కొందరు మాత్రం ఇలాంటి వ్యక్తులను అతి ప్రమోట్ చేయడం వల్ల పోలీసుల పని, వారి ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తున్నారు. పిచ్చి పీక్స్ కి చేరడం అంటే ఇదే అంటున్నారు. మొత్తం మీద, ఐబొమ్మ రవి అనే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, సాధారణ ప్రజల్లో కూడా చర్చకు మార్మోగుతోంది. ఆయన పట్ల అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఒక ఆటో డ్రైవర్ పోస్టర్ పెట్టడం—అది కేవలం చిన్న సంఘటనే అయినా, ప్రజలలో ఉన్న భావోద్వేగాల తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి