అచల్ ఇటీవల తన ఇంజనీరింగ్ విద్యాభ్యాసాన్ని పూర్తిచేసి ఉద్యోగంలోకి చేరడానికి బెంగళూరుకి వచ్చింది. అదే సమయంలో ఆమెకు దూరపు బంధువు అయిన మయాంక్ తో స్నేహం పెరగడంతో ఈ స్నేహమే ఆమెను ఆపదలోకి నెట్టేసేలా చేసింది. కూతురు ఆత్మహత్యపై అచల్ తల్లి మాట్లాడుతూ.. మయాంక్ తన కూతురితో స్నేహంగా ఉన్నట్టు నటించారు. కొన్ని రోజులకు అతను తన అసలు బుద్ధిని బయట పెట్టాడని, తన కూతురితో శారీరక సంబంధం కోసం వేధించారంటూ అచల్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
అందుకు తన కూతురు ఒప్పుకోకపోవడంతో.. తన కూతురు పై దాడి చేసి చాలా మానసికంగా కూడా హింసించే వాడని, రాత్రి సమయాలలో ఫోన్ చేసి అసభ్యకరమైన మెసేజ్లు పంపించి మరీ బెదిరించే వాడని వీటన్నింటి వల్ల అచల్ విసిగిపోయి.. నవంబర్ 22న పాండురంగ నగర్ లో తన బంధువుల ఇంట్లో ఉరివేసుకొని మరణించింది అంటూ అచల్ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. అచల్ మరణాంతరం పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా..అచల్ మొబైల్ కి అసభ్యకరమైన మెసేజ్ లతో వేధిస్తూ వందలాది మెసేజ్ లు రావడంతో మాయాంక్ పైన ముందే ఫిర్యాదు చేసింది అచల్ తల్లి. ఇప్పుడు కూతురు మరణించడంతో.. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఐపిసీ సెక్షన్ 306,354A, 506 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన జరిగి ఇప్పటికి పది రోజులు అవుతూ ఉన్న నిందితుడు మయాంక్ , అతని తల్లి ఇద్దరు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలియజేస్తున్నారు. తన కూతురు మరణానికి కారణమైన వారిని శిక్షించాలి అంటూ అచల్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ విషయం పైన హీరోయిన్ ఆషికా ఏ విధంగా స్పందించలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి