మొదటి స్థానంలో అహన్ పాండే, రెండవ స్థానంలో అనీత్ పాండే నిలిచారు. ఆ తర్వాత స్థానాలు అమీర్ ఖాన్, ఇషాన్ ఖట్టర్, రష్మిక, లక్ష్య , కళ్యాణి ప్రియదర్శన్, త్రిప్తి దిమ్రి, రుక్మిణి వసంత్, రిషబ్ శెట్టి తర్వాతి స్థానాలలో ప్రజాదారణ జాబితాలో ఉన్నారు. అలాగే ఈ ఏడాది ప్రజాదారణ పొందిన భారతీయ దర్శకుల జాబితా విషయానికి వస్తే.. సైయారా సినిమా డైరెక్టర్ మోహిత్ సూరి మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో ఆర్యన్, ఆ తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజు, నాలుగవ స్థానం అనురాగ్ కశ్యప్, ఐదవ స్థానం పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా మరి కొంతమంది దర్శకులు టాప్- 10 జాబితాలో చోటు సంపాదించుకున్నారు.
IMDB లో తన తొలిచిత్రమే అత్యధిక ప్రజాదారణ పొందిన చిత్రంగా పేరు సంపాదించడంతో ఆహన్ మాట్లాడుతూ.. నా మొదటి చిత్రమే ఈ ఏడాది అత్యంత ప్రజాదారణ గల భారతీయ తారల జాబితాలో నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ గుర్తింపు నా వృత్తి పట్ల నాకున్న బాధ్యతను మరింత గుర్తు చేస్తాయని తెలిపారు ఈ విషయంపై డైరెక్టర్ మోహిత్ సూరికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. హీరోయిన్ అనీత్ పడ్డా మాట్లాడుతూ.. ఐఎండిబి జాబితాలో రెండవ స్థానంలో నిలవడం ఇప్పటికి నమ్మలేకపోతున్న.. నా జీవితాన్ని ఎన్నో విధాలుగా మార్చేసింది సైయారా ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నానని తెలియజేసింది అనిత్ పడ్డా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి