గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైడెడ్ చిత్రం అఖండ 2. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. బాలకృష్ణ కెరియర్ లోనే మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా లెవెల్లో ఈ రోజున (డిసెంబర్ 5) గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్లు బ్రేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దీంతో ఈ సినిమా పైన అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ని మేకర్స్ రద్దు చేసినట్లుగా ప్రకటించారు.


ఈ విషయం విన్న అభిమానులు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా ఈ సినిమా రిలీజ్ నే వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు షాక్ గురవుతున్నారు. కొన్ని అనివార్య కారణాలవల్ల అఖండ 2 చిత్రం అనుకున్న తేదీకి విడుదల చేయలేకపోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఇది అభిమానులతో పాటు తమకు కూడా బాధ కలిగించే విషయమని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు కూడా కృషి చేస్తున్నామంటూ చిత్ర బృందం ప్రకటించారు.


ఈ వార్తతో అటు అభిమానులు , సిని ప్రేక్షకులు కూడా తీవ్ర నిరాశకులోనయ్యారు. మరి కొన్ని గంటలలో విడుదలకావాల్సి ఉన్న అఖండ 2 చిత్రం చివరి నిమిషంలో సినిమాను కూడా విడుదలను వాయిదా వేసినట్లు ప్రకటించడంతో అభిమానుల తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇచ్చినప్పటికీ టెక్నికల్ సమస్యల వల్ల ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు వినిపిస్తున్నాయి. అలాగే ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థకు కూడా 14 రీల్స్ సంస్థ రూ .28 కోట్ల రూపాయలు  చెల్లించాల్సి ఉందని మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో మద్రాస్ హైకోర్టు కూడా ఈ సంస్థకే అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తమిళనాడులో ఈ సినిమా విడుదల చేయకుండా అడ్డుపడింది. ఇన్ని అడ్డంకుల మధ్య అఖండ 2 ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: