సమంత – దర్శకుడు రాజ్ నిడిమోరు.. డిసెంబర్ 1న సన్నిహిత బంధువులు, అత్యంత దగ్గరి స్నేహితుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో జరిగిన ఈ వివాహం పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో సాగిందని  ఫొటోలు స్పష్టమయ్యాయి. పెళ్లి జరిగిన వెంటనే సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోల్ని షేర్ చేస్తూ, ఆ ప్రత్యేక రోజుకు సంబంధించిన డేట్‌ను కూడా ప్రస్తావించింది. ఆ ఫొటోలు షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియా అంతటా ట్రెండింగ్‌ టాపిక్‌గా మారిపోయాయి.


ఇక వివాహం అనంతరం సమంతరాజ్ ఒకే ఫ్రేమ్‌లో ఇప్పటివరకు కనిపించకపోవడంతో, అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లి ఉంటారేమో అనే కథనాలూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. అంతేకాదు, ఈ స్టార్ కపుల్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్నది తెలుసుకునేందుకు అభిమానులు సోషల్ మీడియాను పూర్తిగా కవర్ చేస్తున్నారు.ఇలాంటి సమయంలో హఠాత్తుగా సోషల్ మీడియాలో ఒక పాత వీడియో తిరిగి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సమంత నైట్ డ్రస్‌లో బెడ్‌రూం‌లోకి వస్తుండగా, ఆమెను ఒకరు లోపలికి తీసుకెళ్తారు. దానికి కొద్ది సేపటికే దర్శకుడు రాజ్ అక్కడికి వచ్చి, బెలూన్స్ పేల్చి కేక్ కట్ చేయించేందుకు రెడీ అవుతారు. ఈ వీడియో పూర్తిగా సరదాగా ఉన్నప్పటికీ, దీని మీద కొన్ని పేజీలు సెన్సేషనల్ ట్యాగ్‌లు పెట్టి వైరల్ అయ్యేలా షేర్ చేయడం మొదలుపెట్టాయి.



కొంత మంది ఈ వీడియోను తాజాగా షూట్ చేసినదిగానే భావించి కామెంట్లు పెడుతుండగా, వాస్తవం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో సమంతరాజ్ వివాహం కాక ముందు రోజుల నాటి పాత వీడియో మాత్రమే. పెళ్లి తర్వాత తీసిన వీడియో ఇది కాదని, కొంతమంది నెటిజన్లు కూడా స్పష్టం చేస్తున్నారు.అయినా కూడా సమంతరాజ్ పెళ్లి తర్వాత జంటగా కలిసి మళ్లీ ఎప్పుడు కనిపిస్తారన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. వివాహ వేడుక చిత్రాలు ఎటువంటి ప్రచారాలు లేకుండా, చాలా నిశ్శబ్దంగా జరిగిపోయిన నేపథ్యంలో, ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కనిపించే ప్రతి చిన్న సమాచారం, ఫోటో, వీడియోపై అభిమానులు, మీడియా భారీ స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. ఇక, వీరిద్దరూ త్వరలో ఎక్కడైనా కలిసి కనిపిస్తే, అది సోషల్ మీడియాలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా నెలకొని ఉంది.


https://www.instagram.com/p/Cr28Cn4LI3O/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==








మరింత సమాచారం తెలుసుకోండి: