‘ఇడియట్’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ పాట లాగే ఈ సాంగ్ కూడా మాస్ ఆడియెన్స్‌ను అలరించేలా, రవితేజ మార్క్ ఎనర్జీతో తెరకెక్కిందని సమాచారం. అప్పట్లో ఆ పాట ఎంత హంగామా క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కాబట్టే మరోసారి అలాంటి స్టెప్స్ వస్తున్నాయన్న మాట బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు.ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిగా కామెడీ, ఎంటర్టైన్‌మెంట్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీవ్వ్ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి హై ప్రొడక్షన్ విలువ్స్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘బెల్లా బెల్లా’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో మ్యూజిక్ ప్రమోషన్‌కి మంచి ఆరంభం లభించింది. దాంతో ఇప్పుడు రెండో సింగిల్ అప్‌డేట్ విడుదల చేసి, మేకర్స్ మరింత హైప్ పెంచారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. చూడాలి మరి రవితేజ ఈసారి అయిన ఈ సినిమాతో హిట్ అందుకుంటాడో లేదో..???
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి