ఈ సినిమా సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఫాంటసీ అంశాలతో రూపొందుతున్నట్లు సమాచారం. కథ పరంగా కూడా ఇది ఇప్పటివరకు టాలీవుడ్‌లో రాని కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని టాక్. ఈ మూడు పాత్రలు మూడు వేర్వేరు షేడ్స్‌లో ఉండబోతున్నాయని, ఆయన కెరీర్‌లోనే ఇది ఒక ప్రత్యేకమైన ప్రయోగంగా మారనుందని అభిమానులు భావిస్తున్నారు.ఇక హీరోయిన్‌ల విషయానికి వస్తే, ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు హీరోయిన్లతో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారని టాక్ వినిపిస్తోంది. భారీ తారాగణం, గ్రాండ్ విజువల్స్‌తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఒక బిగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కథ డెప్త్, విజువల్ స్కేల్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అంతేకాదు, రాబోయే ఏప్రిల్ 8 న టైటిల్ టీజర్‌ను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ రోజు బన్నీ పుట్టినరోజు. ఈ టీజర్‌ను ఆ ప్రత్యేకమైన రోజున రిలీజ్ చేసి అభిమానులకు గ్రాండ్ సర్ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. టైటిల్ టీజర్‌తో పాటు సినిమాలోని కీలక పాత్రల లుక్స్ లేదా క్యారెక్టర్ రివీల్స్ కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం.
మొత్తానికి అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా మార్కెట్‌లో కూడా భారీ రికార్డులు సృష్టించనుందని అభిమానులు ఆశిస్తున్నారు. టీజర్ రిలీజ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా, అప్పటివరకు ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగేలా ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి