ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొద్దిరోజులుగా ఎక్కువగా వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా సినిమాలను పైరసీ చేస్తూ విదేశాలలో ఉంటూ ఆన్లైన్లో అప్లోడ్ చేసేవారు.. కానీ గడిచిన కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కి వచ్చారని ఇన్ఫర్మేషన్ రావడంతో కూకట్ పల్లి రెయిన్ బో విస్టా అపార్ట్మెంట్లో ఉన్న రవిని అరెస్టు చేసి సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా రవి అపార్ట్మెంట్లో ఉండే కంప్యూటర్స్, హార్డ్ డిస్క్ , మొబైల్ , తన అకౌంట్ లో ఉన్న రూ .3కోట్ల నగదును కూడా ఇప్పటికే ఫ్రీజ్ చేశారు. అలాగే ఐబొమ్మ, బప్పం వంటి వెబ్ సైట్లను కూడా బ్లాక్ చేయించారు అధికారులు. గత కొద్దిరోజులుగా విచారణ చేస్తూ ఉండగా తెలియదు గుర్తులేదు అంటూ చెబుతున్నారని అధికారులు తెలిపారు. అనంతరం విచారణలో భాగంగా రవి తాజాగా కొన్ని సంచలన విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది.


గురువారం(డిసెంబర్ 18) ఈరోజు విచారణలో హెచ్డి సినిమాలు పైరసీ పైన నోరు విప్పినట్లు అధికారులు తెలుపుతున్నారు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాలను పైరసీని చేసినట్లుగా ఒప్పుకున్నారు. అలాగే క్యూబ్ నెట్వర్క్ ను సైతం హ్యాక్ చేసినట్లుగా తెలియజేశారు. అలా సాటిలైట్ లింక్ హ్యాక్ చేసి మరి హెచ్డి ఫార్మాట్లో రికార్డు చేసినట్లుగా తెలియజేశారు. వాటికి హెచ్డి హబ్ పేరిట ఒక టెలిగ్రామ్ ఛానల్ ని ఏర్పాటు చేసి అందులో కొన్ని పైరసీ లింక్ అప్లోడ్ చేసి 100 నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేసినట్లుగా తెలిపారట.


హిట్ 3, కిష్కింద పూరి వంటి చిత్రాలను సాటిలైట్ లింకు ద్వారానే పైరసీ చేసినట్లు రవి ఒప్పుకున్నారు. అనంతరం తిరిగి మళ్లీ కస్టడీలోకి తీసుకున్నారట. సుమారుగా 12 రోజులపాటు కస్టడీ కోసం నాంపల్లి కోర్టు అనుమతి ఇవ్వగా, అధికారులు ఒక్కో కేసును నాలుగు రోజులపాటు కస్టడీ చేయడానికి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. కోర్టు అనుమతి మేరకే ఈరోజు చంచల్ కూడా జైలు నుంచి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని మరి విచారించినట్లు సమాచారం. త్వరలోనే మరింత విచారణ చేసి రవి నుంచి మరికొన్ని విషయాలు బయట పెడతామని చెబుతున్నారు అధికారులు

మరింత సమాచారం తెలుసుకోండి: