-
Anand Deverakonda
-
anand malayalam actor
-
Balakrishna
-
brahmaji
-
Chitram
-
Cinema
-
cinema theater
-
Comedy
-
devayani
-
Director
-
editor mohan
-
Episode
-
festival
-
Hero
-
Heroine
-
Hyderabad
-
JagapathiBabu
-
jagapati babu
-
Josh
-
Jr NTR
-
kajal aggarwal
-
koratala siva
-
Lover
-
maya
-
Mukesh
-
Mumbai
-
Mythri Movie Makers
-
nandamuri taraka rama rao
-
nithya menon
-
NTR
-
prasad
-
Rajani kanth
-
rajiv kanakala
-
Ravi
-
ravi anchor
-
REVIEW
-
Romantic
-
Sai Kumar
-
Samantha
-
sathyam
-
satya
-
Simhadri
-
Srimanthudu
-
Tammudu
-
Telugu
-
Thammudu
-
tiru
-
Traffic police
సత్యం (మోహన్ లాల్) ఓ మెకానిక్ ఊళ్లో ఉన్న తనని తమ్ముడి బలవంతంతో హైదరాబాద్ లో జనతా గ్యారేజ్ ఏర్పాటు చేస్తాడు. కేవలం రిపేర్లే కాకుండా ప్రజల సమస్యలను కూడా సాల్వ్ చేస్తుంటాడు. జనతా గ్యారేజ్ చేస్తున్న పనులు ఓ పెద్ద మనిషి ముఖేష్ (సచిన్ ఖేడ్కర్) కు నచ్చదు. గ్యారేజ్ సత్యంతో పాటు మిగతా మెకానిక్ లు ప్రజల సమస్యలను తీరుస్తుంటారు. గ్యారేజ్ కు వార్నింగ్ ఇచ్చినా మారకపోవడంతో సత్యం తమ్ముడి ఫ్యామిలీని చంపేస్తారు. తన తమ్ముడు కొడుకు ఆనంద్ ను వాళ్ల మామయ్యకు అప్పచెబుతాడు సత్యం. ఇక ఆనంద్ (ఎన్.టి.ఆర్) ఓ నేచర్ లవర్. ప్రకృతికి భంగం కలిగించే ఏ పని చేసినా సరే ఊరుకోడు. అదే క్రమంలో ఓ పార్క్ విషయంలో ముంబైలో గొడవపడటం వల్ల ఆనంద్ మామయ్య (సురేష్) ఆనంద్ ను హైదరాబాద్ కు పంపిస్తాడు. ఈ లోపే సత్య మీద ఎటాక్ జరగడం గ్యారేజ్ లో సమస్యలు తీరుతాయని వచ్చిన ప్రజలు వెనక్కి వెళ్లడం జరుగుతుంది. ఇక ఆనంద్ గురించి తెలుసుకున్న సత్యం జనతా గ్యారేజ్ లో ఆనంద్ ను చేర్చుకుంటాడు. ఇకఅక్కడ అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇంతకీ జనతా గ్యారేజ్ లో అడుగుపెట్టిన ఆనంద్ సత్యంకు ఏమవుతాడు..? ముఖేష్ చేస్తున్న ఆగడాలను జనతా సహాయంతో ఆనంద్ ఎలా చేధించాడు..? అన్నది అసలు కథ.
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నేచర్ లవర్ గా నూటికి నూరు పళ్లు న్యాయం చేశాడు. కమర్షియల్ హీరో అంటే కేవలం ఫైట్స్ ఒక్కటే కాకుండా ఓ సెపరేట్ క్యారక్టరైజేషన్ ట్రై చేయడం గొప్ప విషయం. సినిమాలో తారక్ ను కొత్త కోణంలో చూడొచ్చు. ఎంతో స్టైలిష్ లుక్ తో జూనియర్ ఆకట్టుకున్నాడు. ఇక నటన పరంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక హీరోయిన్స్ సమంత, నిత్యా మీనన్లు కేవలం ఉన్నారు అని అనిపించేందుకే. పాటల కోసం తప్పించి సమంత, నిత్యా అంతగా ఉపయోగపడలేదు. ఇక సినిమాకు ఆయువు పట్టుగా నిలిచిన పాత్ర సత్యంగా చేసిన మోహన్ లాల్. ఈ పాత్రకు కొరటాల శివ ఆయన్నే ఎందుకు ఎంచుకున్నారో సినిమా చూస్తే అర్ధమవుతుంది. కంప్లీట్ యాక్టర్ గా మోహన్ లాల్ అదరగొట్టేశాడు. ఇక పోలీస్ కమిషనర్ గా సాయి కుమార్ చాలా రోజుల తర్వాత మంచి రోల్ చేశారు. అంతేకాదు మెకానిక్స్ గా నటించిన అజయ్, బ్రహ్మాజి మిగతా వారు కూడా మంచి నటన కనబరిచారు.
జనతా గ్యారేజ్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడేలా చేసుకున్న కొరటాల శివ ముందు రెండు సినిమా కన్నా ఈ సినిమాలో కాస్త పట్టు తప్పాడని అనిపిస్తుంది. కథకు బలం చేకూర్చే కొన్ని సందర్భాల్లో రాసుకున్న డైలాగ్స్ మాత్రం ఆకట్టుకున్నాయి. సినిమాకు దేవి మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. రెండు పాటలు అద్భుతంగా ఉన్నాయి. తిరు కెమెరా పనితనం ప్రతి ఫ్రేం లో అందంగా అనిపించింది. జూనియర్ ను ఇంతకుముందు ఎన్నడు చూడని విధంగా తిరు తన కెమెరా పనితనాన్ని చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ సినిమాకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో అదరగొట్టేశారు.
మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాకు ముందు నుండి భారీ హైప్ రావడంతో అంచనాలు భారీ రేంజ్లో ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో గ్యారేజ్ కాస్త వెనుక పడ్డది. కమర్షియల్ సినిమానే కథాబలంతో చెప్పాలనుకున్న కొరటాల శివ జనతా గ్యారేజ్ విషయంలో గ్రిప్పింగ్ కోల్పోయాడు.
అంచనాలు బాగ ఉండే సరికి సినిమా కాస్త అటు ఇటుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అన్నట్టు ఉన్నా సెకండ్ హాఫ్ లో మొదటి 20 నిమిషాలు కేక పెట్టించేశాడు. కాని మళ్లీ క్లైమాక్స్ లో వీక్ అయిపోతుంది. సో మొత్తానికి జూనియర్ ఎకౌంట్ లో ఓ మంచి సినిమా పడ్డట్టే. కాని కొరటాల శివ ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేది.
TWEETS:
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి