మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. అక్టోబర్ 2 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ నడుస్తున్నాయి. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆగష్టు 22 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ తో పాటు సినిమాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను ఆరోజున నిర్మాత రామ్ చరణ్ చెప్పబోతున్నారు. దీంతో పాటు అదే రోజున కొరటాల డైరెక్షన్ లో సినిమా ఓపెనింగ్ ఉంటుంది.
పవన్ కళ్యాణ్ కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. వచ్చే ఏడాది ఉగాది రోజున మెగాస్టార్.. కొరటాల సినిమా రిలీజ్ ఉంటుందట. ఈ సినిమాలో అనసూయ ఓ కీ రోల్ చేస్తున్నది.
అయితే, ఇందులో హీరోయిన్ ఎవరు అన్నది తెలియాలి. బలమైన సామాజిక అంశంతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. భరత్ అనే నేను తరువాత కొరటాల చేస్తున్న సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది.