కరోనా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలపై తన పంజా విసురుతోంది. ఈ ధాటికి జనం పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. ఇప్పటికే 97 వేల మంది మృతి చెందగా లక్షలాది మంది కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నారు. అమెరికాలో ఈ పరిస్థతి మరీ ఘోరంగా తయారయ్యింది. అగ్ర రాజ్యం ప్రస్తుతం శవాల దిబ్బగా కనిపిస్తోంది. ఈ కారణంగా ఎంతో మంది ప్రజలు కనీసం తిండి తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఆయా దేశాలు ప్యాకీజీలు ప్రకటిస్తూ నష్ట నివారణ చర్యలు చేపడుతున్నాయి. అయితే

IHG

వివిధ దేశాలలో ఉన్న ఎన్నారైలు సైతం భారత దేశాన్ని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు కొంత మేర డబ్బుని సేకరిస్తూ తమవంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అమెరికాలో అత్యధికంగా  ఉన్న భారతీయ ఎన్నారైలు కరోనాపై పోరుకు భారీ నిధులని సేకరించారు. ఇప్పటి వరకూ వారు సేకరించిన విరాళాల విలువ 6 లక్షల డాలర్లు..అంటే మన కరెన్సీలో సుమారు రూ.4,56,24000. అయితే...

IHG

ఈ విరాళాలని ఛలో గివ్ ఫర్ కోవిడ్ -19 పేరుతో సేకరించారు. అమెరికాలో స్థిరపడిన ఇండో అమెరికన్స్ అలాగే ఎన్నారైలు కలిసి ఈ నిధులు సమకూర్చారు. ఈ నిధులని ఇండియా, అమెరికాలో ఉన్న భారతీయులని ఆదుకోవడంలో  వినియోగిస్తామని తెలిపారు. భారత్ లో ఉన్న గూంజ్ అనే స్వచ్చంద సంస్థ ద్వారా బాధితులని ఆడుకోవడానికి ఖర్చు చేస్తామని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: