ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా భారీన పడి వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. కరోనా మహమ్మారి పంజా విసురుతున్న తరుణంలో ఇతర దేశాలు సహాయం కోరితే భారత్ తన వంతు సహాయం చేస్తోంది. ఇతర దేశాల విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించడమే కాకుండా ప్రాణాధార మందుల్ని పొరుగు దేశాలకు ఉచితంగా పంపిణీ చేసింది. 
 
హైడ్రాక్సీ క్లిరోక్విన్ తో పాటు పారసిటమాల్ మాత్రలను ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మారిషస్, సీసెల్స్, మయన్మార్, నేపాల్ దేశాలకు పంపించింది. అమెరికా, స్పెయిన్, బ్రెజిల్, బ్రిటన్, జర్మనీలతో ఇది వరకే మన ఔషధ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాలకు లోబడి హైడ్రాక్సీ క్లిరోక్విన్ ఎగుమతులు జరిగాయి. అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాము అడిగిన రీతిలో మందుల ఎగుమతులను అనుమతించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. 
 
తాజాగా మారిషస్ అధ్యక్షుడు ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రవింద్ జగన్నాథ్ " ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం ద్వారా వైద్య సామాగ్రి నిన్న చేరిందని... వైద్య సామాగ్రిని ఉదారంగా ఇచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు" అని ట్వీట్ లో పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం బ్రెజిల్ ఆధ్యక్షులు జైల్స్ బోలెనారో భారత్ హైడాక్సీ క్లిరోక్విన్ ను ఉత్పత్తి చేసే ముడిపదార్థాలను పంపించడానికి అంగీకరించడంతో కృతజ్ఞతలు తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: