
ఇక రష్యా ఉక్రెయిన్ పై చేసిన యుద్ధం రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తుంది తప్ప ఎక్కడా సద్దుమనుగుతున్నట్లు మాత్రం కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఇక ఉక్రెయిన్ లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రష్యా విరుచుకు పడుతూ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఏకంగా మారణహోమం జరుగుతుంది. ఎంతో మంది సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా రష్యా సైనికుల దాడిలో చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఉక్రెయిన్ కు అన్నివిధాలుగా అండగా నిలుస్తామని అంటూ చెప్పిన అమెరికా మాత్రం కేవలం మొన్నటి వరకు ఆర్థిక ఆంక్షలు తోనే సరిపెట్టుకుంటూ ఉంది.
కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఉక్రెయిన్ కు ఆయుధాలను అందించేందుకు అమెరికా సిద్ధం అయింది అని తెలుస్తోంది. ఇక రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ కు అమెరికా స్విచ్ ది బ్లెడ్ డ్రోన్స్ అందించనుంది. స్విచ్ బ్లేడ్ అనేది కెమెరాలు, గైడెన్స్ పేలుడు పదార్థాలతో కూడిన రోబోటిక్ స్మార్ట్ బాంబ్. ఇక వీటిని కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఆపరేట్ చేస్తూ రష్యా సైనిక యుద్ధ టాంకర్ ల పై దాడి చేసి పేల్చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది నలభై నిమిషాల పాటు ఎగురుతూ 50 కిలోమీటర్లు ప్రయాణించగలవు. ఇక వీటిని అటు ప్రజలకు అందించేందుకు అగ్రరాజ్యమైన అమెరికా సిద్ధం కావడం గమనార్హం.