మొన్నటి వరకు ప్రపంచ దేశాలు కరోనా వైరస్ తో ఎంత అల్లాడిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న దేశాలు పెద్ద దేశాలు అనే తేడా లేకుండా చైనాలో పుట్టిన కరోనా వైరస్ అన్ని దేశాలను వనికించింది.  ఇక ప్రతి దేశంలో ఆర్తనాదాలు వినిపించేలా చేసింది. అగ్ర దేశాలు సైతం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొని అల్లాడిపోయాయి అని చెప్పాలి. అధునాతన టెక్నాలజీతో కూడిన వైద్య సదుపాయం ఉన్న వైరస్ నుంచి ఎలా బయటపడాలో తెలియక ప్రతి ఒక్కరూ బిక్కు బ్రతుకును వెల్లదీసారు.


 కోట్ల మంది ప్రాణాలను బలి తీసుకున్న కరోనా వైరస్ ఎట్టకేలకు తగ్గుముఖం పట్టింది.  అన్ని దేశాల ప్రభుత్వాలు కఠినమైన ఆంక్షలు విధించడం.. ఇక నివారణ చర్యలు చేపట్టడంతో కరోనా వైరస్ ప్రభావం ప్రస్తుతం అన్ని దేశాల్లో తగ్గింది అని చెప్పాలి. తద్వారా ఇప్పుడిప్పుడే అగ్ర దేశాలు సైతం వైరస్ ప్రభావం నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ పుట్టినిల్లు అయినా చైనా మాత్రం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది అని చెప్పాలి. మొన్నటి వరకు కరోనా వైరస్ కేసులు తగ్గినట్లే కనిపించిన మళ్లీ అక్కడ ఒక్కసారిగా కేసులు విజృంభిస్తున్నాయి.


 ప్రపంచం మొత్తం ప్రస్తుతం కఠినమైన లాక్ డౌన్ నుంచి విముక్తి పొందుతూ ఉంటే.. చైనా మాత్రం వైరస్ కేసులు పెరుగుతున్న నేపథంలో.. మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే చైనాలో ఇటీవలే ఒకే ఒక్క రోజు 31 వేల కోవిడ్ కేసులు వెలుగులోకి రావడం అందరిని భయాందోళనకు గురిచేస్తుంది.  ఇక భారీగా కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అక్కడ పాక్షిక లాక్ డౌన్.. ట్రావెల్ ఆంక్షలు విధించేందుకు చైనా ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే చైనాలో కరోనా వైరస్ విజృంభనకు ఓమిక్రాన్ సబ్ వేరియంట్లే కారణమని అక్కడి వైద్యాధికారులు చెబుతున్నారు. ఎందుకంటే కొత్తగా వెలుగులోకి వచ్చిన కేసులలో 35 శాతం మందిలో కూడా ఈ వేరియంట్లే కనిపిస్తున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: