
ఇలా వినూత్నమైన ఆలోచనలతో కేవలం తక్కువ సమయంలోనే ఎంతోమంది రెస్టారెంట్ యాజమాన్యాలు కస్టమర్ల దృష్టిని ఆకర్షించి సక్సెస్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇలాంటి ఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు న్యూజిలాండ్ లో కూడా ఒక పిజ్జా సంస్థ ప్రకటించిన ఆఫర్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా అయితే డిస్కౌంట్ ప్రకటించడం లేదంటే క్యాష్ బ్యాక్ లు ప్రకటించడం ద్వారా కస్టమర్లను ఆకర్షించడం చూసాము. కానీ ఇక్కడ ఒక పిజ్జా సంస్థ మాత్రం కలలో కూడా ఊహించని ఒక ఆఫర్ ను ప్రకటించింది.
ఏకంగా ఇప్పుడు పిజ్జా తిని చనిపోయిన తర్వాత డబ్బులు చెల్లించాలి అంటూ ఆఫర్ పెట్టింది. న్యూజిలాండ్ కు చెందిన హెల్ పిజ్జా సంస్థ ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం. వారి వద్ద పిజ్జా తిన్న వెంటనే బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని.. చనిపోయిన తర్వాత ఆ బిల్లును చెల్లించవచ్చని చెప్పింది. అదేంటి చనిపోయాక ఎలా చెల్లిస్తారు అనుకుంటున్నారు కదా... ఆఫర్ ద్వారా పిజ్జా తిన్నవారు చనిపోయిన తర్వాత వీలునామా ఆధారంగా వారు బ్యాంకు ఖాతా లేదా కుటుంబ సభ్యుల నుంచి పిజ్జా డబ్బులు వసూలు చేస్తామని చెబుతుంది సదర సంస్థ. అయితే ఈ ఆఫర్ వెనుక ఎలాంటి మోసం లేదు అంటూ చెబుతోంది.