ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ప్రతి విషయాన్ని కూడా ఎంతో సులభతరంగా మార్చేసింది అని చెప్పాలి. ఇక దీంతో ప్రస్తుతం మనిషి ఏం చేయాలన్న పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి పనిని ఎంత సులభంగా చేసేందుకు అవకాశం వచ్చింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో ప్రయాణాలు కూడా ఎంతో సులభంగా మారిపోయాయి. ఒకప్పుడు షేర్ ఆటోలో 10 మంది కూర్చొని ఎంతో ఇరుకుగా ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఒక్కో ప్రయాణికుడు తమకోసం ఆటో లేదా కార్ బుక్ చేసుకునే సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయి.


 ఇలాంటి సర్వీస్ లను అందించేందుకు ఓలా, ఉబర్, రాపిడో అంటూ ఎన్నో రకాల కంపెనీలు పోటీపడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో అతి తక్కువ ధరలకే ప్రస్తుతం ఎంతో నాణ్యతతో కూడిన సర్వీసులు పొందగలుగుతున్నారూ జనాలు. దీంతో ప్రస్తుతం ఎక్కడికైనా వెళ్లాలి అంటే సొంతంగా వాహనం ఉండాల్సిన పనిలేదు. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ ఇస్తే చాలు ఇంటి ముంగిట్లో రిసీవ్ చేసుకుని ఇక గమ్యస్థానానికి చేర్చే సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఇలాంటి సర్వీస్ ల ద్వారా కస్టమర్లకు ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇక యూఎస్ లో కూడా ఒక జంటకు ఉబర్ ఇలాంటి షాక్ కి ఇచ్చింది. కాస్త దూరం ప్రయాణానికి ఏకంగా 24 లక్షల రూపాయల బిల్లు ఛార్జ్ వేసింది ఉబర్. ఐదవ వివాహ వార్షికోత్సవ వేడుకల్లో ఉన్న జంట తర్వాత రోజు కాఫీ షాప్ వెళ్ళింది. దీనికోసం ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. ఇక ఆ తర్వాత  రెస్టారెంట్లో పేమెంట్ చేయాలి అనుకుంది. కానీ అకౌంట్లో మాత్రం డబ్బులు లేవు అనే విషయాన్ని గుర్తించింది. అయితే అకౌంట్లో ఉన్న లక్షల రూపాయలు ఏమయ్యాయి అని చెక్ చేస్తే అసలు విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయింది ఆ జంట. వెంటనే ఉబర్కు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఆమె అకౌంట్లో నుంచి 29,994 డాలర్లు కట్ అయ్యాయి అంటే భారత కరెన్సీలో 24 లక్షలు. ఈ విషయంపై స్పందించిన ఉబర్ ఇక అమౌంట్ రిఫండ్ చేస్తాము అంటూ హామీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: