ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా మహిళలపై వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. అయితే ఒకప్పటిలా మహిళలు వంటింటి కుందేలుగా ఉండడం ఇష్టపడటం లేదు. పురుషులకు తాము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తూ మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి రంగంలో కూడా రాణిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా గొప్ప విజయాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్న మహిళలను.. కామపు కోరలు మాత్రం వెనక్కి లాగుతూనే ఉన్నాయి అని చెప్పాలి.


 ఎంతోమంది కామాంధులు దారుణంగా వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు. అయితే ఇలా మహిళలను వేధింపులకు గురిచేసిన వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలు తీసుకువచ్చినప్పటికీ కామాంధుల తీరులో మాత్రం ఎక్కడా మార్పు రావడం లేదు అని చెప్పాలి. ఇక మనదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఇటీవల స్పెయిన్ లో ఏకంగా ఒక మహిళ జర్నలిస్టుకు చేదు అనుభవం ఎదురైంది అని చెప్పాలి. ఒక రాబరీ గురించి మహిళా జర్నలిస్ట్ రిపోర్టింగ్ ఇస్తున్న సమయంలో.. కెమెరా ఉంది అని కూడా వెనకడుగు వేయకుండా ఒక వ్యక్తి ఆమెను అసభ్యంగా తాకాడు.


 మాడ్రిడ్ లో ఈ ఘటన వెలుగు చూసింది. స్థానిక క్యూట్రో ఛానల్ కు చెందిన మహిళా జర్నలిస్ట్ దొంగతనం జరిగిన స్థలానికి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆమె చానాలకు రిపోర్ట్ చేస్తుండగా వెనకనుంచి ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వస్తూ వెనక భాగంలో అసభ్యంగా తాకాడు. అయితే ఆ వ్యక్తి నిన్ను అసభ్యంగా తాకాడా అని కెమెరామెన్ ప్రశ్నిస్తూ అతని వైపు కెమెరాను తిప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఇడియట్ అంటూ కెమెరామెన్ ను తిట్టాడు. అయితే మహిళ రిపోర్టర్ ఇక అతని నుంచి పక్కకు జరిగి మళ్ళి రిపోర్టింగ్ చేస్తుండగా ఏకంగా మహిళ జుట్టు నిమిరెందుకు ప్రయత్నించాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతని పోలీసులు అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: