సమ్మర్ వచ్చింది అంటే చాలు అల్లరి నరేష్ నటించిన కామెడీ మూవీ విడుదల అవ్వడమే కాకుండా ఆమూవీని ఎంజాయ్ చేయడానికి ఎంతోమంది ఫ్యామిలీ ప్రేక్షకులు ధియేటర్లకు వస్తూ ఉండేవారు. రాజేంద్ర ప్రసాద్ తరువాత కామెడీ సినిమాలకు చిరునామాగ మారిన అల్లరి నరేష్ ఒక దశాబద్ధం పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హాస్య హీరోగా తన హవా కొనసాగించాడు.



అయితే ప్రేక్షకుల అభిరుచి మారిపోయి కథలలో వెరైటీ కోరుకుంటున్న పరిస్థితులలో ‘జబర్దస్త్’ హాస్యం పంచ్ డైలాగ్స్ కు అల్లరి నరేష్ నటించే కామెడీ సినిమాలకు తేడాను గుర్తించే ప్రేక్షకులు కరువైపోవడంతో అల్లరి నరేష్ కామెడీ రొటీన్ గా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య గతకొంత కాలంగా సీరియస్ సినిమాలను చేస్తున్న అల్లరోడు తిరిగి ఈనాటితరం ప్రేక్షకులు ఆదరించడం తగ్గించివేసిన తన కామెడీ జోనర్ ను నమ్ముకుని ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్ తో చేసిన మరొక ప్రయత్నం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయినట్లు వార్తలు వస్తున్నాయి.



ఈపరిస్థితుల మధ్య ఈసినిమాతో పోటీగా విడుదలైన సుహాస్ ‘ప్రసన్న వదనం’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో అల్లరి నరేష్ పై యంగ్ హీరో సుహాస్ ఆధిపత్యం ఈవారం రేస్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈరెండు సినిమాలకు ఓపెనింగ్ కలక్షన్స్ పెద్దగా ఆశాజనకంగా లేకపోవడంతో వచ్చేనెల విడుదల కాబోతున్న టాప్ హీరోల సినిమాలు వచ్చే వరకు ధియేటర్ల పరిస్థితి ఇలాగే ఖాళీగా కనిపిస్తుందా అన్న అంచనాలు వస్తున్నాయి.



కొత్త కథలకు చిరునామాగా కొనసాగుతున్న సుహాస్ ‘కలర్ ఫోటో’ మూవీ తరువాత డిఫరెంట్ సినిమాలలో నటిస్తూ నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు ‘రైటర్ పద్మనాభం’ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాలతో చిన్న హీరోలలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన ‘ప్రసన్నవదనం’ మూవీకి విమర్శకుల ప్రశంసలు రేటింగ్స్ బాగా వస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల వేడినీ ఎండల వేడినీ తట్టుకుని కలక్షన్స్ పరంగా నిలబడగలిగితే సుహాస్ అదృష్టవంతుడు అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: