ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అటు టిడిపి, వైసిపి, జనసేన, బిజెపి నాయకులు మాటలతూటాలతో ముంచేత్తుతున్నారు.. ఏపీలో అధికార పార్టీలో ఉన్న వైసీపీని టార్గెట్ చేస్తూ కూటమి నాయకులు ఆ పార్టీ నాయకుల పైన తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు.. ఈ సమయంలో వైసీపీ నాయకులు కూడా కూటమిని ఎదుర్కొంటూ దీటుగానే  సమాధానాలు తెలియజేస్తున్నారు. టిడిపి అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన అటు kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాస్త వ్యయంగానే మాట్లాడడం జరిగింది.


ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.. పుంగనూరు పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈయన మాట్లాడారు ఇద్దరు మాజీ సీఎంలను సైతం ఏకీపారేయడం జరిగింది. 2014 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు 600 హామీలతో ఒక మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పారేశారు అంటూ ఆరోపించారు.. 2019లో వైయస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో అన్ని హామీలను నెరవేర్చామంటూ తెలిపారు. ఇక్కడ టిడిపి వైసిపి పార్టీకి ఉన్న తేడా ఇదేనంటూ కూడా వెల్లడించారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక చచ్చిన పాముతో సమానం అంటూ.. ఆయన తన కొడుకు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి అసలు పోటీనే కాదంటూ కూడా వ్యయంగా తెలియజేశారు.. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి డిపాజిట్లు కూడా రావని ప్రజలు మిథున్ రెడ్డి వెంటే ఉన్నారంటూ చాలా ధీమాని వ్యక్తం చేస్తున్నారు. వాలంటరీలు అందిస్తున్న సేవలు ఎవరు మర్చిపోలేని.. కరోనా కష్టకాలంలో వారు ప్రాణాలకు తెగించి మరి పని చేశారంటూ కూడా తెలిపారు. అలాంటి వాలంటరీ విషయంలో కూడా కూటమి నాయకులు పలు రకాల రాజకీయాలు చేశారంటూ ఆరోపిస్తున్నారు పెద్దిరెడ్డి. జగనన్న చెప్పిందే చేస్తారు చేసేటివి మాత్రమే చెబుతారని తెలిపారు.. చంద్రబాబు లాగా మోసం చేసే అలవాటు లేదని కూడా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: