తాను అనుకున్న అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని పక్కాగా అమలు చేసి చట్టాలు చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో పక్కకి వెళ్లిపోయాడు. మళ్లీ బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత విధానాలనే అమలు చేయడంతో భారతీయుల్లో మళ్లీ ఆశలు రేకేత్తాయి. ఇప్పుడు మళ్లీ అమెరికా వెళ్లాలనుకునే యువత ట్రంప్ కానీ, వివేక్ రామ స్వామి గెలవకూడదని ప్రార్థనలు చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే భారత సంతతి వివేక్ రామ స్వామి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ముప్పావు వంతు ఉద్యోగులను తొలగిస్తానని చెప్పాడు.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం సాధించి ఎన్నికల్లో గెలిస్తే 75 శాతం ప్రభుత్వ ఉద్యోగులను తొలగించి ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గిస్తానని చెప్తున్నాడు. ఎఫ్డీఐ వంటి సంస్థల్ని మూసేసి.. విద్య , ఆల్కహల్, ఇతర అంశాల ప్రక్షాలన చేపట్టి పదవి చేపట్టిన తొలి ఏడాదిలో 50 శాతం వరకు ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తా అని వివరించాడు.
ప్రస్తుతం అమెరికాలో 22.50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 16 లక్షల మందిని నాలుగేళ్లలో తొలగిస్తానని చెప్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదా చేస్తానని చెప్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగాల్లో అమెరికన్లనే నియమిస్తానని చెబుతున్నారు. ఉద్యోగాలు తొలగిస్తానని చెప్పడం రిపబ్లికన్లకు ప్రతికూలాంశమే అవుతుంది. ఎందుకంటే ఎవరూ కూడా ఉద్యోగాలను కోల్పోవాలని అనుకోరు. ఉద్యోగ కల్పన అంటే ఆదరిస్తారు కానీ తొలగిస్తా అంటే ఎవరూ మద్దతు తెలపరు. ఈ ప్రకటన వారి విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి