రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.  ఉక్రెయిన్ ముందు ఉంచి రష్యాపై నాటో దేశాలు చేస్తున్న యుద్ధమని అందరికీ తెలిసిందే.  అయితే నేరుగా రష్యాతో నాటో దేశాలకు యుద్ధం తప్పదేమో అనే సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల రష్యా చేసిన మిస్సైల్ దాడి తమ ప్రాంతంలోకి వచ్చి పడింది అని పోలెండ్ ఆరోపించింది. దీనికి ఉక్రెయిన్ కూడా అవుననే సమాధానం ఇచ్చింది. అమెరికా దర్యాప్తులో తేలిన విషయమేమిటంటే ఉక్రెయినే రష్యా నుంచి స్వాధీనం చేసుకున్న మిస్సైల్ తో ఈ పని చేసింది అని.  దీంతో యుద్ధం ఆగిపోయింది. దీనికి ఇరు దేశాలు తల దించుకోవాల్సింది పోయి తమ వ్యూహం విఫలమైందని బాధపడ్డాయి.  


మళ్లీ ఇటీవల పక్కనే ఉన్న లుద్వేనియా, లాత్వియా అనే ప్రాంతాలను ఉక్రెయిన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కొన్ని డ్రోన్స్ దెబ్బతిని మీ ప్రాంతాల్లోకి వచ్చాయని ఉక్రెయిన్ ఉసిగొల్పింది. వారు ముందు లేదని ఆ తర్వాత ఉందని చెప్పారు. అయితే ఇవి ఉక్రెయిన్ కూల్చితే పడిన శిథిలాలు తప్ప వేరేవి ఏమి లేవని చెప్పారు. దీంతో యుద్ధం మరోసారి ఆగిపోయింది.  ప్రస్తుతం మరో అంశం చోటు చేసుకుంది. అమెరికా, యూరప్, నాటో దేశాలతో సాగుతున్న బల్గేరియా భూ భాగంలోకి రష్యాకి చెందిన కిల్లర్ డ్రోన్  ప్రవేశించిందని అని దానిని మేమే కూల్చేశాం అని ఉక్రెయిన్ చెప్తోంది. అయితే బల్గేరియా లోపల ఉక్రెయిన్ లేదు. మరి అలాంటప్పుడు దానిని ఎలా కూల్చి వేస్తుంది. వాస్తవానికి ఆ సరిహద్దుల్లో కూల్చిన కిల్లర్ డ్రోన్ బల్గేరియా లో పడింది.


అయినా సరే ఇది నాటో మీద దాడి.. అయినా నాటో స్పందిచడం లేదు ఏంటి అని ఉక్రెయిన్ నాటో దేశాలను రెచ్చగొడుతోంది. ఇలా వరుసగా రెచ్చగొడుతున్నా నాటో దేశాలు ఎం మాట్లాడకుండా మిన్నుకుండిపోయాయి. అమెరికా సరే అంటే మాత్రం ఏ చిన్న సాకు చూపైనా సరే రష్యాపై యుద్ధానికి ఇవి దిగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: