
అయితే ఎప్పుడైతే జి20 సమావేశాలు అక్కడ జరిపినప్పుడు అన్ని దేశాల వాళ్ళు వచ్చి ప్రశాంతంగా వెనక్కి వెళ్లారో అప్పుడు ఈ పాకిస్తాన్ మాటలు అన్ని డొల్ల కబుర్లే అని తేలిపోయింది. ఇప్పుడు కాశ్మీర్లో వాణిజ్య వ్యాపారాలు జరుగుతున్నాయి. పర్యాటకులు కూడా అందమైన కాశ్మీర్ ను ఎంజాయ్ చేసి వెళుతున్నారు. అయితే ఇలా జరగడం పాకిస్తాన్ కు నచ్చడం లేదని తెలుస్తుంది. పాకిస్తాన్ ఆక్యుఫైడ్ కాశ్మీర్లోని ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్ కి ఎదురు తిరిగే పరిస్థితి ఏర్పడింది.
దాంతో పాకిస్తాన్ కి ఇప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ కు అండగా నిలుస్తుంది టర్కీ. మొన్న టర్కీ కి చెందిన ప్రధానమంత్రి ఎగ్డోగన్ ఐక్యరాజ్యసమితి వేదికగా కాశ్మీర్లోని పరిస్థితి సాధారణంగా మారకపోతే ప్రపంచానికి సమస్య అని అన్నారు. అయితే ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ ను పాకిస్తాన్ కోసం ఆందోళనగా ఉందని చెప్పుకొస్తున్నారు టర్కీ ప్రధాని. కాశ్మీర్ లో ఈ పరిస్థితి ఎప్పుడో పోయింది.
కానీ ప్రపంచ దేశాలకి ఇప్పుడు ముప్పు అంటే టర్కీ. ఎందుకంటే అది ఒకవైపు రష్యా తో మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు అమెరికాను కూడా కదుపుతూ ఉంటుంది. మన ప్రధాని నరేంద్ర మోడీ ఇదంతా చూస్తున్నారు కాబట్టే టర్కీ ప్రమేయం లేకుండానే అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య రహదారిని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన టర్కీకి వ్యతిరేకమైన గ్రీస్ ని కూడా ప్రోత్సహిస్తూ వస్తున్నారు.