అంతేకాదు మరి కొంతమంది ఇలా ఏదో ఒకటి కొత్తగా చేసి ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పాలి. సాధారణంగా అయితే సినీ సెలబ్రిటీలకు క్రీడాకారులకు అడగక పోయినా ఫాలోవర్ల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారి సినిమాలను లేదా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని లేదంటే క్రీడాకారులకు వారి ఆటను చూసి అభిమానులుగా మారిపోయేవారు. ఇక సోషల్ మీడియాలో వాళ్ళని ఫాలో అవడం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పెట్టే అప్డేట్స్ తొందరగా చూసేందుకు ఇలా ఫాలోవర్లుగా మారుతూ ఉంటారు అని చెప్పాలి.
అయితే ఇలా ఇప్పటివరకు ఎంతోమంది నటీనటులు క్రీడాకారులకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఉండడం చూశాం. కానీ ఒక గుడ్డుకు ఫాలోవర్లు ఉన్నారు అంటే నమ్ముతారా.. అది కూడా 49 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారని మీకు తెలుసా అంటే.. అందరూ తెల్ల మొఖం వేస్తారు. అయితే ఈ వరల్డ్ రికార్డు ఎగ్ అకౌంట్ పోస్ట్ చేసిన గుడ్డు ఫోటోకి 6 కోట్ల లైక్స్ రావడంతో వరల్డ్ సెకండ్ మోస్ట్ లైక్డ్ పోస్ట్ గా రికార్డులకు ఎక్కింది. ఈ ఫోటోను 2019లో పోస్ట్ చేయగా ఇప్పటికీ ఎవరో ఒకరు ఈ గుడ్డుని ట్రోల్ చేస్తూ కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఫాలోవర్లు కూడా పెరుగుతూనే ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి