సాధారణం గా పాకిస్తాన్ భారత్ సరిహద్దులో ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూ నే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు పాకిస్తాన్ ఏదో ఒక విధంగా భారత్ పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి కాల్పుల కు తెగబడుతూ  ఉంటుంది ఇక ఆ తర్వాత భారత సైన్యం అప్రమత్తమై దీటుగా బదులిస్తూ నే ఉంటుంది. అయితే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని కాశ్మీర్ ప్రాంతంలో గత కొంతకాలం నుంచి తీవ్ర స్థాయి లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి అన్న విషయం తెలిసిందే.



 వరుసగా పాకిస్తాన్ భారత సైన్యం పై కాల్పుల కు  తెగబడుతూ ఉండడం తో ఇక కాశ్మీర్ ప్రాంతం లో పరిస్థితి రోజు రోజుకు మరింత ఉద్రిక్తంగా మారిపోతుంది అదే సమయంలో భారత సైన్యం దీటుగా బదులిస్తు పాకిస్తాన్ సైనికులు తరిమి కొడుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యం లో ప్రస్తుతం కాశ్మీర్లో భారత్ పై  దాడి చేసేందుకు పాకిస్థాన్ సైనికులు సరిహద్దు ల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిణామాల నేపథ్యంలో... ఏదో ఒక విధంగా కాశ్మీర్లో తమ సైన్యాన్ని పెంచుకుని భారత్ పై దాడి చేసేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.



 ఈ క్రమంలోనే టర్కీ ప్రోద్బలంతో సిరియాకు చెందిన సైన్యాన్ని కాశ్మీర్లో కి ఇమ్రాన్ ప్రభుత్వం రప్పిస్తున్నట్లు   సమాచారం.   భారీగా సిరియా సైనికులను  కాశ్మీర్ సరిహద్దు ప్రాంతం లోకి రప్పించి భారత్పై దాడి చేయడానికి ప్రస్తుతం పాకిస్తాన్ ప్లాన్ చేసిందని  విశ్లేషకులు అంటున్నారు. కూడా కాశ్మీర్ ప్రాంతంలోభారత ఆర్మీ కూడా ఎంతో అప్రమత్తంగా అవుతుందని...  సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రానున్నరోజుల్లో కాశ్మీర్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: