ఇండస్ట్రీలో వెరీ లవబుల్ జంటగా పేరుపొందిన వారిలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ముందు స్థానంలో ఉంటారు.. వీరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం.. 2018 నుంచి లవ్ కొనసాగిస్తున్న వీరు పెట్టకేలకు 2025లో ఎంగేజ్మెంట్ ద్వారా పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్  కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. అలాగే సింపుల్గా ఎంగేజ్మెంట్ ఈవెంట్ నీ చేసుకున్నా కూడా కోట్లు ఖర్చు అయ్యాయి అనే వార్త కూడా వినిపిస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ నిశ్చితార్థ వేడుక హైదరాబాదులోని విజయ్ దేవరకొండ కు ఎంతో ఇష్టమైన ఇంటిలో జరిగిందట.

 విజయ్ దేవరకొండ ఎంతో ఇష్టంగా కట్టుకున్న తన 15 కోట్లతో మాన్షన్  హౌస్ లోనే వీరి యొక్క ఎంగేజ్మెంట్ వేడుకను దగ్గరి కుటుంబీకుల మధ్య జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ వేడుకకు వచ్చిన వారంతా ఆయన ఇల్లు చూసి ఆశ్చర్యపోయినట్టు సమాచారం. ఈ ఇల్లు మొత్తం తెల్లని ఇంటీరియర్స్ మార్బుల్ ఫ్లోరింగ్ విస్తృతమైనటువంటి గదులు,  ఫ్రెంచ్ విండోస్ సౌకర్యాలతో ఒక రాజమహల్ ని తలపించినట్టు ఉందని తెలుస్తోంది. ఈ ఇంట్లోనే శుక్రవారం రాత్రి వీరి నిశ్చితార్థ వేడుక పూర్తి చేసినట్టు సమాచారం. అంతేకాకుండా  ఈ వేడుకలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా వారి బంధాన్ని గుర్తుచేసుకొని కాసేపు ఎమోషనల్ కూడా అయ్యారట.

అంతేకాకుండా రష్మిక  గోల్డ్ కలర్ మరియు పీచ్ కలర్ డ్రెస్, దేవరకొండ సాంప్రదాయకమైనటువంటి తెల్లటి కుర్తా ధరించారని  తెలుస్తోంది. ఇక వీరు ఎంగేజ్మెంట్ కోట్ల విలువ చేసే డైమండ్ రింగ్స్ తో ఒకటైనట్టు సమాచారం.అయితే వీరి వివాహం 2026 ఫిబ్రవరిలో కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య గ్రాండ్ గా జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ జంట  నిశ్చితార్థంతో పెళ్లి చేసుకోవడానికి దారి సుఘమం చేసుకున్నందుకు ఇటు రష్మిక అభిమానులు ఇంకోవైపు దేవరకొండ అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: