తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే.  తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ... అతి పెద్ద పండుగగా అందరూ జరుపుకుంటారు.  పూలు వికసించే సీజన్‌ లో, వాగులు, వంకలు పొంగి పొర్లే తరుణంలో ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.  ఈ బతుకమ్మ సంబురాలు జరుపుకునే వారం రోజుల పాటు మహిళలు బొడ్డెమ్మ ను బతకమ్మతో పాటు నిమజ్జనం చేసేస్తారు.  నిమజ్జమనం అనంతరం పిండి పదార్ధాలు, లడ్డులు ఆగరిస్తారు.  ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి కి వచ్చే అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమవుతుంది.

ఈ ఎంగిలిపూల బతుకమ్మ... దుర్గాష్టమి రోజున... పెద్ద బతుకమ్మ పేరుతో ముగిస్తారు మహిళలు. కలరా, మలేరియా మరియు ప్లేగు లాంటి మహమ్మారి రోగాలను తరిమికొట్టేందుకు.. ఈ బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు.  బతుకమ్మ తొమ్మిది రోజులు ఆడతారు. ఏ రోజున ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం.
ఎంగిలిపూల బతుకమ్మ ; బతుకమ్మ పండుగలో మొట్టమొదట గా వచ్చేది ఎంగిలిపూల బతుకమ్మ . ఈ రోజు బొడ్డెమ్మలతో బతుకమ్మ ఆడతారు మహిళలు.
అటుకుల బతుకమ్మ ; సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో  ఈ రోజున అమ్మవారికి నైవేద్యం పెడతారు.

 
ముద్దపప్పు బతుకమ్మ : రెండో రోజున ముద్ద పప్పు బతుకమ్మను జరుపుకుంటారు.  ఈ రోజున పాలు మరియు ముద్దపప్పును నైవేధ్యంగా పెడతారు.
నానే బియ్యం బతుకమ్మ ; నానేసిన బియ్య మరియు పాలు, అలాగే బెల్లం కలిపి నైవేద్యం అమ్మవారికి పెడతారు.
అట్ల బతుకమ్మ : ఈ రోజున అమ్మవారికి దోశలు లేదా అట్లు నైవేద్యంగా పెడతారు.  
అలిగిన బతుకమ్మ ; ఈ రోజున అశ్వయుజ పంచమి...కాబట్టి బతుకమ్మ ఆడరు.
వేప కాయల బతుకమ్మ : ఈ రోజున బియ్యం పిండిని బాగా వేయించి... వేపపండ్లు గా చేసి... నైవేద్యంగా అమ్మవారికి పెడతారు.  
వెన్నముద్దల బతుకమ్మ ; ఈ రోజున నువ్వులు, వెన్న మరియు బెల్లం ఇలాంటివి నైవేద్యంగా పెడతారు.  
సద్దుల బతుకమ్మ ; దుర్గాష్టమి రోజున ఈ సద్దుల బతుకమ్మ జరుగుతుంది.  ఈ రోజున ఐదురకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ రోజున మహిళలు కొత్త చీరలు, గాజులు పెట్టుకుని.. ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: