టీ కాంగ్రెస్ లో మరోసారి కోవర్టు రగడ మొదలైంది. రేవంత్ వర్సెస్ జగ్గారెడ్డి వ్యవ హారం ముదిరి పాకాన పడింది. జగ్గారెడ్డి,సీఎం కేసీఆర్ కోవర్టు అంటూ సోషల్ మీడియాలో  జరుగుతున్న ట్రోలింగ్ పై ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ నాయ కులు పోట్లాడితే సమస్యలపై లేదంటే నాయ కులే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కామన్. తెలం గాణలో కాంగ్రెస్ నేతల మధ్య పంచాయతీ పీక్ స్టేజ్ కి వెళ్ళింది. ఏకంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డినే మార్చాలనే వరకు వ్యవ హారం వెళ్ళింది. నిన్న సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ రాశారు.

 ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పైనే ప్రధానంగా చర్చకు దారి తీసేలా,జగ్గారెడ్డి లేఖాస్త్రం సంధించారు. రేవంత్ ఒంటెద్దు పోకడ పార్టీకి నష్టమని, ఆయన నైనా మార్చండి లేదంటే ఆయన వైఖరి నైనా మార్చండి అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తే ప్రశంసి స్తాతానని , పొరపాట్లు జరిగితే ప్రశ్నిస్తానన్నారు జగ్గారెడ్డి. సోనియా గాంధీ కి రాసిన లేఖ ఎలా లీక్ అయిందో తెలియదన్న ఆయన, తానెక్కడ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని  స్పష్టం చేశారు.

రేవంత్ ను తాను ఏమన్నా, తనను రేవంత్ ఎన్ని  కామెంట్స్ చేసినా, శత్రువు మీద యుద్ధం చేసేటప్పుడు ఇద్దరం కలిసి పని చేస్తామన్నారు. ఏ అంశం గురించయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి  జగ్గారెడ్డి లేఖ రాయవచ్చని ఏఐసిసి స్పష్టం చేసింది. రాజకీయాల్లో చెక్స్ అండ్ బ్యాలెన్స్ కామన్ అని, అయితే జగ్గారెడ్డి మీడియా కు లేఖ విడుదల చేయడం సరైంది కాదని అంటోంది.అంతర్గత అంశాలు మీడియాతో చర్చించవద్దని, పిఏసీలో చర్చించామని, ఇప్పుడు దాన్ని ఉల్లంఘిస్తూన్నట్లు ఉందని అభిప్రాయ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: