ఇక కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమంలో కుప్పంలో పాల్గొంటున్న వేళ..ప్రోటోకాల్ ప్రకారం స్థానికంగా ఎమ్మెల్యే అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు సమాచారం ఇచ్చినట్లు స్థానిక అధికారుల నుంచి తెలుస్తోంది. మరి ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందినా.. చంద్రబాబు నాయుడు హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. ఉదయం 9.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కుప్పం బయలుదేరతారు. 10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. 11.15-12.45 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొంటారు.తరువాత వైఎస్సార్‌ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. 1.20 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి 3.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మొదట గెలవాలి.. అది నెగ్గితే.. మిగిలిన నియోజకవర్గాల్లో నెగ్గడం కష్టం కాదన్నది వైసీపీ లెక్క.. అందుకే కుప్పంపై ఎక్కువగా జగన్ ఫోకస్ చేస్తున్నారు. అందుకే అడగకుండానే కుప్పానికి వరాలు జల్లు కురిపిస్తున్నారు.


ఇటీవల నియోజకవర్గాల రివ్యూలు చేపట్టిన జగన్.. కుప్పం నుంచే ఆ కార్యక్రమం ప్రారంభించారు.. అంతేకాదు కుప్పంలో చంద్రబాబు ను ఓడిస్తే.. మంత్రి పదవి గిఫ్ట్ గా ఇస్తాను అంటూ బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కుప్పంపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్న జగన్.. ఇప్పుడు నేరుగా కుప్పం కోటను ఢీ కొట్టేందుకు రెడీ అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి సారి జగన్ కుప్పం పర్యటనకు వెళ్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో అనూహ్యంగా వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. వచ్చే ఎన్నికలకు సంబంధించి కుప్పం అభ్యర్ధిగా ఎమ్మెల్సీ భరత్ ను సీఎం ఖరారు చేసారు. భరత్ ను గెలిపిస్తే వచ్చే ప్రభుత్వంలో మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. సీఎంగా ఇదే నియోజకవర్గం నుంచి చంద్రబాబు 14 ఏళ్లు పని చేసినా కుప్పం రెవిన్యూ డివిజన్ చేయలేకపోయారంటూ పలు సందర్భాల్లో సీఎం ఎద్దేవా చేసారు. అలాగే కుప్పం కోసం భారీగా నిధులు కూడా విడుదల చేశారు.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: